రవితేజ కు జీరో సైజ్ అవసరమా..!
కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా తయారైంది హీరో రవితేజ పర్సనాలిటి. వయసు పెరుగుతున్న కొద్ది ఫిజికల్ గా కొన్ని మార్పులు ఎటువంటి వారికైన సాధారణమే. ఎప్పటికి పాతికెళ్ల కుర్రాడిలా కనిపించాలనుకునే ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడానికి మన హీరోలు కూడా ఎంతో కష్టపడుతుంటారు. ఆఫ్ కోర్స్ కేవలం అభిమానుల కోసమే కాక పోయినా.. కెరీర్ పరంగా పది కాలల పాటు ఇండస్ట్రీలో కొనసాగాలంటే తప్పదు. అయితే రవితేజ కాస్త వయసు మీద […]
కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా తయారైంది హీరో రవితేజ పర్సనాలిటి. వయసు పెరుగుతున్న కొద్ది ఫిజికల్ గా కొన్ని మార్పులు ఎటువంటి వారికైన సాధారణమే. ఎప్పటికి పాతికెళ్ల కుర్రాడిలా కనిపించాలనుకునే ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడానికి మన హీరోలు కూడా ఎంతో కష్టపడుతుంటారు. ఆఫ్ కోర్స్ కేవలం అభిమానుల కోసమే కాక పోయినా.. కెరీర్ పరంగా పది కాలల పాటు ఇండస్ట్రీలో కొనసాగాలంటే తప్పదు. అయితే రవితేజ కాస్త వయసు మీద పడిన తరువాత నే హీరో గా సక్సెస్ అందుకున్నాడు. తన ఎనర్జీ…జోష్ తో తనదైన మార్క్ ను చాల షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో క్రియోట్ చేసుకోగలిగాడు. దీంతో రోటిన్ అయినప్పటికి.. రవితేజ ను ఆడియన్స్ అంగీకరిస్తూ వస్తున్నారు. కానీ… ఈ మధ్య కిక్ 2 ఇచ్చిన డిజాస్టర్ ఎఫెక్ట్ తన మార్కెట్ ను చాలెంజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ సినిమా కోసం రవితేజ దాదాపు 10 కేజల బరువు తగ్గి మరీ సన్నాగా కనిపించాడు. అదేమంటే.. బరువు కాస్త పెరిగాను ఒక పది కేజిలు తగ్గించాను అని ప్రెస్ మీట్స్ లో తనే స్వయంగా చెప్పాడు.
ఇక తాజాగా రిలీజ్ అయిన బెంగాల్ టైగర్ చిత్రంలో కూడా రవితేజ కిక్ 2 చిత్రంలో మాదిరే మరీ సన్నాగా కనిపించాడు. విక్రమార్కుడు వంటి చిత్రంలో రవితేజ లుక్ చాల బావుంటుంది. ఆ పర్సనాలిటి కూడా అభిమానులకు బాగా నచ్చింది. మొన్నటి పవర్ చిత్రం వరకు కూడా మన మాస్ రాజా లుక్ ఇంప్రెసివ్ గానే ఉంది. ఈ మధ్య ఆయనకు పట్టిన ఏజ్ కాన్షియస్ గోల అసలకే ఎసరు తె చ్చెలా ఉంది. ఈ విషయాన్ని రవితేజ గుర్తించి..ఎంత త్వరగా తన నార్మల్ పర్సనాలిటికి వస్తే అంత మంచింది అంటున్నారు పరిశీలకులు. ఇక బెంగాల్ టైగర్ రివ్యూల పరంగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికి.. సినిమా రెగ్యులర్ మాసాల ఫార్మెట్ లో ఆడియన్స్ ఫస్ట్ క్లాస్ లోనే పాస్ చేస్తుండటం విశేషం.