పీవీపీ మాల్‌పై టీడీపీ ఎమ్మెల్యే దండయాత్ర!

విజయవాడ బందర్‌ రోడ్డులోని పీవీపీ మాల్ వద్ద ఆటో స్టాండ్ ఏర్పాటు పెద్ద వివాదాన్ని రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేతృత్వంలో ఏకంగా వంద మంది మాల్‌లోకి వెళ్లి అక్కడి సిబ్బందిపై దాడిచేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. పీవీపీ యాజమాన్యం వేలు పెట్టేందుకు చోటిస్తే టీడీపీ అనుబంధ ఆటో యూనియన్ ఏకంగా తలపెట్టే ప్రయత్నం చేయడంతో వివాదం చెలరేగింది. పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడైన నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌కు చెందిన మాల్‌పై టీడీపీ ఎమ్మెల్యే దండెత్తి వెళ్లడం చర్చనీయాంశమైంది. […]

Advertisement
Update:2015-11-22 02:49 IST

విజయవాడ బందర్‌ రోడ్డులోని పీవీపీ మాల్ వద్ద ఆటో స్టాండ్ ఏర్పాటు పెద్ద వివాదాన్ని రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేతృత్వంలో ఏకంగా వంద మంది మాల్‌లోకి వెళ్లి అక్కడి సిబ్బందిపై దాడిచేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. పీవీపీ యాజమాన్యం వేలు పెట్టేందుకు చోటిస్తే టీడీపీ అనుబంధ ఆటో యూనియన్ ఏకంగా తలపెట్టే ప్రయత్నం చేయడంతో వివాదం చెలరేగింది. పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడైన నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌కు చెందిన మాల్‌పై టీడీపీ ఎమ్మెల్యే దండెత్తి వెళ్లడం చర్చనీయాంశమైంది.

మాల్‌ ముందు రెండుమూడు ఆటోలు నిలుపుకునేందుకు పీవీపీ యాజమాన్యం తొలుత అనుమతివ్వగా … టీడీపీ అనుబంధ యూనియన్ టీఎన్‌టీయూసీ ఏకంగా ఆటో స్టాండ్ ఏర్పాటుకు సిద్ధమైంది. మాల్‌ ముందు ఆ మూల నుంచి ఈ మూల వరకూ దాదాపు 30 ఆటోలు నిలిపేలా స్టాండ్ ఏర్పాటుకు టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ప్రయత్నించారు. పీవీపీ మాల్ ముందు ఏకంగా టీడీపీ జెండా దిమ్మెలను ఏర్పాటు చేయబోయారు. టీఎన్‌టీయూసీ బోర్డు కూడా పెట్టేశారు. ఆటో స్టాండ్‌ ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్‌ను ఆహ్వానిస్తూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఇది గమనించిన వైసీపీ, కాంగ్రెస్ అనుబంధ ఆటో యూనియన్లు కూడా తమకూ మాల్‌ ముందు ఆటోలు నిలుపుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో ఇరకాటంలో పట్ట పీవీపీ యాజమాన్యం అసలు ఎవరూ కూడా ఆటోలు నిలపవద్దని కోరింది. మాల్ ముందు ఆటో స్టాండ్ ఏర్పాటు ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ అనుబంధ యూనియన్ను కోరింది. కానీ వారు వినలేదు. దీంతో మాల్ సిబ్బంది టీడీపీ జెండా దిమ్మెలను, ఫ్లెక్సీలను తీసుకెళ్లి మాల్‌లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన అనుచరులతో కలిసి పీవీపీ మాల్ వద్దకు వచ్చారు. మాల్ యాజమాన్యం, సిబ్బందితో గొడవపడ్డారు. మాల్ జనరల్ మేనేజర్‌ను ఎమ్మెల్యే అనుచరులు కొట్టారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ దాడి జరిగిందని పొట్లూరి వర ప్రసాద్ సోదరుడు రవి మీడియాతో చెప్పారు.

పీవీపీ మాల్ వద్ద ఇప్పటికే రోడ్డు ఇరుకుగా ఉందని కాబట్టి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయవద్దని కోరామని రవి చెప్పారు. అయితే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దాదాపు వంద మంది మాల్‌ మీదకు వచ్చారని చెబుతున్నారు. ఘటనపై పోలీసులకు పీవీపీ మాల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పీవీపీ మాల్ యజమాని పొట్టూరి వరప్రసాద్… సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. ఈ విషయం తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇలా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News