ఏపీ ఉద్యోగులకు 3ఆప్షన్లు, 9నెలల గడువు

అమరావతి శంకుస్థాపన పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం ఇక ఉద్యోగుల తరలింపుపై దృష్టిసారించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి పాలనకు శ్రీకారం చుట్టారు. ఇక ఉద్యోగులను కూడా వీలైనంత త్వరగా ఏపీకి తరలించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. దీనికి అనుబంధంగానే అన్ని విభాగాల ఉద్యోగులకు, అధికారులకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఉద్యోగులందరికీ మూడు ఆప్షన్లు ఇస్తున్నట్లు సర్క్యులర్‌లో తెలిపారు. ఈ […]

Advertisement
Update:2015-10-28 08:06 IST

అమరావతి శంకుస్థాపన పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం ఇక ఉద్యోగుల తరలింపుపై దృష్టిసారించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి పాలనకు శ్రీకారం చుట్టారు. ఇక ఉద్యోగులను కూడా వీలైనంత త్వరగా ఏపీకి తరలించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. దీనికి అనుబంధంగానే అన్ని విభాగాల ఉద్యోగులకు, అధికారులకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఉద్యోగులందరికీ మూడు ఆప్షన్లు ఇస్తున్నట్లు సర్క్యులర్‌లో తెలిపారు.
ఈ నవంబర్‌ 30 లోపు ఎవరెవరు వెళ్తారు? 2016 ఫిబ్రవరి ఆఖరుకు ఎంతమంది వెళ్తారు? జూన్‌ 1, 2016 నాటికి ఎంతమంది వెళ్తారో చెప్పాలని సర్క్యులర్ లో ప్రభుత్వం కోరింది. ఉద్యోగుల వివరాలను తెలిపేందుకు ఒక ప్రొఫార్మా కూడా ఇచ్చారు. ఈ నెలాఖరులోపు వివరాలు అందజేయాలని, వారిని నవంబర్ లో తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులంతా ఒకేసారి వెళ్తే సౌకర్యాలు కల్పించడం ఇబ్బంది అవుతుందని.. దశలవారీగా వెళ్తే విజయవాడలో పాలనా వ్యవహారాలు సాఫీగా జరుగుతాయనే ఉద్దేశంతో సర్క్యులర్‌ జారీ చేసినట్లు మీనా తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నిశాఖల అధిపతులతో, ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. .
అయితే స‌చివాల‌య ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన స‌ర్కుల‌ర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగుల‌ను వ్యక్తిగ‌తంగా అభిప్రాయాలు అడ‌గ‌కుండా ఆయా శాఖ‌లవారీగా అభిప్రాయాలు తీసుకోవాలంటున్నారు. స‌చివాల‌యంలో ఒక్కో విభాగం ఒక్కో చోట కాకుండా ఇప్పుడున్న‌ట్లే అన్ని విభాగాలు ఒకేచోట ఉండేలా చూడాలంటున్నారు. ఈ నెల 31న సీఎస్ తో ఉద్యోగ సంఘాల నేత‌లు, హెచ్ వోడీల సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద వచ్చే ఏడాది జూన్ నాటికి ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఏపీకి తరలివెళ్లడంపై సీఎం చంద్రబాబు ఆదేశాలు ఏమేరకు సఫలం అవుతాయో చూడాలి.

Tags:    
Advertisement

Similar News