ఏటీఎంలో ఎనీ టైమ్ అప్పు
బ్యాంకులు వినియోగదారులకు సేవలు అందించడంలో మరో అడుగు ముందుకెస్తున్నాయి. ఏటీఎం ద్వారా రుణాన్ని తీసుకునే సదుపాయాన్ని కల్పించే దిశలో అడుగులేస్తున్నాయి. ముందుగా ఈ సదుపాయాన్ని కేవలం హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు కల్పిస్తోంది. ఈ మేరకు ఆ బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో ఏటీఎం కార్డు ద్వారా చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తోంది. వ్యక్తిగత రుణాల వ్యవస్థను బలోపేతం చేసిన హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు తమ దగ్గర ఉన్న వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన వివరాలు తదితరాలను […]
బ్యాంకులు వినియోగదారులకు సేవలు అందించడంలో మరో అడుగు ముందుకెస్తున్నాయి. ఏటీఎం ద్వారా రుణాన్ని తీసుకునే సదుపాయాన్ని కల్పించే దిశలో అడుగులేస్తున్నాయి. ముందుగా ఈ సదుపాయాన్ని కేవలం హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు కల్పిస్తోంది. ఈ మేరకు ఆ బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో ఏటీఎం కార్డు ద్వారా చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తోంది. వ్యక్తిగత రుణాల వ్యవస్థను బలోపేతం చేసిన హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు తమ దగ్గర ఉన్న వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన వివరాలు తదితరాలను పరిశీలించి అప్పటికప్పుడు రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ వివరాలను పరిశీలించేందుకు బ్యాంకుకు సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత కేవలం పది నిమిషాల వ్యవధిలో ఈ రుణం మంజూరవుతుందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఈ పద్ధతి ద్వారా వినియోగదారులను, ఖాతాదారులను పెంచుకునేందుకు బ్యాంక్ ప్లాన్ చేస్తోంది.