ఘోర రోడ్డు ప్రమాదం... 15 మంది దుర్మరణం
ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో చెర్లోపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 15 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళుతున్న సమయంలో శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పెళ్ళి బృందంతో వెళుతున్న ఓ డీసీఎం వ్యాను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరందరినీ కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చేవూరు నుంచి మాలకొండకి పెళ్ళి బృందాన్ని తీసుకు వెళుతున్న డీసీఎంలో […]
ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో చెర్లోపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 15 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళుతున్న సమయంలో శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పెళ్ళి బృందంతో వెళుతున్న ఓ డీసీఎం వ్యాను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరందరినీ కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చేవూరు నుంచి మాలకొండకి పెళ్ళి బృందాన్ని తీసుకు వెళుతున్న డీసీఎంలో ప్రయాణిస్తున్నవారే మరణించారని చెబుతున్నారు. ట్రావెల్స్ బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే బొల్తా పడి మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా తగులబడి పోయింది. స్థానికుల సాయంతో గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన సంఘటన స్థలికి బయలుదేరి వెళ్ళారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు.