రెండు కిలోల బరువు తగ్గిన జగన్
ఐదు రోజుల్లో రెండు కిలోల బరువు తగ్గిపోయాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి. ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. బీపీ, షుగర్ లెవెల్స్‌లో తేడా వచ్చింది. పల్స్ రేటు కూడా అనారోగ్యాన్ని సూచిస్తోంది. దాదాపు 100 గంటలుగా ఆయన ఎలాంటి ఆహారం తీసుకోలేదు. అమ్మ చూసి వెళ్ళింది. కాని చేయగలిగిందేముంది? ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఆయన దీక్ష చేపట్టారు. ప్రస్తుతం ఆయనకు అభిమానుల అండదండలు, వారు ఇచ్చే […]
ఐదు రోజుల్లో రెండు కిలోల బరువు తగ్గిపోయాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి. ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. బీపీ, షుగర్ లెవెల్స్‌లో తేడా వచ్చింది. పల్స్ రేటు కూడా అనారోగ్యాన్ని సూచిస్తోంది. దాదాపు 100 గంటలుగా ఆయన ఎలాంటి ఆహారం తీసుకోలేదు. అమ్మ చూసి వెళ్ళింది. కాని చేయగలిగిందేముంది? ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఆయన దీక్ష చేపట్టారు. ప్రస్తుతం ఆయనకు అభిమానుల అండదండలు, వారు ఇచ్చే నైతిక మద్దతే బలం. అదే ఆయన ఆరోగ్యాన్ని రక్షించాలి. బాగా నీరసించి పోయారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఆయనకు మూడుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. దీక్ష కొనసాగింపు మంచిది కాదని డాక్టర్లు ఆయనకు సలహా ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జగన్ దీక్షకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సభలు, సమావేశాలు జరుపుతున్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు దీక్ష విరమించబోనని భీష్మించిన జగన్‌కు మద్దతుదారుల అండదండలు ప్రార్థనలే శ్రీరామరక్ష.