9 వరకు ప్రభుత్వానికి గడువు: టీటీడీపీ
రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణం రైతు రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ డిమాండు చేసింది. అన్నదాతలకు పూర్తి రుణమాఫీకి ఈ ప్రభుత్వానికి ఈనెల 9 వరకు గడువు ఇస్తున్నామని, ఆలోపు ప్రభుత్వం అనుకూలంగా స్పందించకపోతే 10వ తేదీ తెలంగాణ బంద్‌కు పిలుపు ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. రైతు సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి నిమ్మకునీరెత్తినట్టు కూడా లేదని ఆరోపించారు. రైతుల సమస్యలపై తెలంగాణ […]
రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణం రైతు రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ డిమాండు చేసింది. అన్నదాతలకు పూర్తి రుణమాఫీకి ఈ ప్రభుత్వానికి ఈనెల 9 వరకు గడువు ఇస్తున్నామని, ఆలోపు ప్రభుత్వం అనుకూలంగా స్పందించకపోతే 10వ తేదీ తెలంగాణ బంద్‌కు పిలుపు ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. రైతు సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి నిమ్మకునీరెత్తినట్టు కూడా లేదని ఆరోపించారు. రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇతర పార్టీలన్నింటినీ కలుపుకు పోతామని ఆయన అన్నారు. 9వ తేదీలోగా అన్ని పార్టీలతో కలిసి తాము ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కలుస్తామని తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి సర్కారుకు నిరసన తెలుపుతామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే బంద్‌కు అన్ని పార్టీలను కలుపుకుపోతామని ఆయన అన్నారు. కాగా రైతు సమస్యలపై విపక్షాలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి ఎవరితో చర్చిస్తారని అసెంబ్లీలో టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. పత్తికి రూ.5 వేల మద్ధతు ధర ఇవ్వాలని లేకుంటే ఆందోళన చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. జెండాలను పక్కన పెట్టి రైతుల పక్షాన ఐక్యపోరాటం చేస్తామని ఎర్రబెల్లి అన్నారు.