వాజ్‌పెయి మరణించారని నివాళి!
పాఠాలు చెప్పాల్సిన గురువులు పెడదోవ పడుతున్నారు. తమ అజ్ఞానంతో యావత్ జాతికి స్ఫూర్తిగా నిలిచిన మహానుభావులను బతికుండగానే చంపేస్తున్నారు. అంతటితో ఆగుతున్నారా? వారి చిత్రపటాలకు దండలు వేసి దండం పెడుతున్నారు. మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణానికి ముందే ఓ మంత్రి నివాళులర్పించిన ఘటన మరవకముందే.. మాజీ ప్రధాని, దేశానికి అణుహోదా కల్పించిన ధీశాలి అటల్ బీహారీ వాజ్‌పెయి మరణించారంటూ పాఠశాలకు సెలవు ప్రకటించిన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఇటీవలే దేశ అత్యున్నత పౌర […]
Advertisement
పాఠాలు చెప్పాల్సిన గురువులు పెడదోవ పడుతున్నారు. తమ అజ్ఞానంతో యావత్ జాతికి స్ఫూర్తిగా నిలిచిన మహానుభావులను బతికుండగానే చంపేస్తున్నారు. అంతటితో ఆగుతున్నారా? వారి చిత్రపటాలకు దండలు వేసి దండం పెడుతున్నారు. మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణానికి ముందే ఓ మంత్రి నివాళులర్పించిన ఘటన మరవకముందే.. మాజీ ప్రధాని, దేశానికి అణుహోదా కల్పించిన ధీశాలి అటల్ బీహారీ వాజ్‌పెయి మరణించారంటూ పాఠశాలకు సెలవు ప్రకటించిన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఇటీవలే దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అందుకున్న వాజ్‌పెయి కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే!
ఏం జరిగిందంటే..!
మాజీ ప్రధాని వాజ్ పెయి చనిపోయారనే తప్పుడు వార్త ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఓ గ్రామంలో కమలాకాంత దాస్ అనే ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ చెవినపడింది. బాధ్యతగల ప్రధానోపాధ్యాయుడు అయి ఉండి, విషయాన్ని ధ్రువీకరించుకోకుండా పాఠశాలకు సెలవు ప్రకటించేశాడు. విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్థులు ప్రధానోపాధ్యాయుడి తీరుపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అతనిపై కలెక్టర్ సనాతన్ మాలిక్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. కమలాకాంత దాస్ ను వెంటనే సస్పెండ్ చేస్తామని, వీలుంటే క్రిమినల్ చర్యలకు వెనకాడేది లేదని ప్రకటించారు. ఇటీవల మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణానికి వారం రోజులు ముందు జార్ఖండ్ విద్యాశాఖా మంత్రి నీరా యాదవ్ కలాం చిత్రపటానికి నివాళులు అర్పించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే! దేశంలో అజ్ఞానులైన గురువుల సంఖ్య పెరుగుతుండటం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది.
Advertisement