కేసీఆర్‌ సొంత ప్రయోజనాలకే ప్రాణిహిత: సబిత

కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో కళ్ళు తెరిచి చూస్తే అర్ధమవుతుందని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి హరీష్‌రావుకు సలహా ఇచ్చారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సోమవారం మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సబిత ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాను పట్టించుకోలేదని, ఆ సమయంలో జిల్లా కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సబిత అంతే ధీటుగా స్పందించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, […]

Advertisement
Update:2015-09-08 11:28 IST
కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో కళ్ళు తెరిచి చూస్తే అర్ధమవుతుందని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి హరీష్‌రావుకు సలహా ఇచ్చారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సోమవారం మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సబిత ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాను పట్టించుకోలేదని, ఆ సమయంలో జిల్లా కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సబిత అంతే ధీటుగా స్పందించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్…, జంట నగరాలకు కృష్ణా జలాలు కాంగ్రెస్‌ హయాంలో వచ్చినవి కావా అని ప్రశ్నించారు.‘600 కిలోమీటర్లు నీరు పారించేది సిద్దిపేట, గజ్వేల్ చెరువులు నింపడానికేనని, ఇందుకోసం రంగారెడ్డి జిల్లాను బలి చేస్తారా’అని సబిత సూటిగా ప్రశ్నించారు. మరో 72 కిలోమీటర్లు నీరు పారిస్తే రంగారెడ్డి జిల్లాకు నీరు వస్తుందని, జిల్లాకు అన్యాయం జరుగుతున్నా ఏమీ పట్టనట్లు మంత్రి మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తూ కేసీఆర్‌కు వత్తాసు పలుకుతున్నారన్నారు.
Tags:    
Advertisement

Similar News