రేవంత్‌రెడ్డి బెయిల్‌ షరతుల సడలింపు

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, కొడంగల్‌ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్‌పై అవినీతి నిరోధక శాఖ కోర్టు విధించిన షరతులను ఎత్తి వేసింది. ఏసీబీ కేసుకు సంబంధించి గతంలో రేవంత్‌కు హైకోర్టు పలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. కొడంగల్ నియోజకవర్గంలోనే ఉండాలని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు లేదని కోర్టు షరతులు విధించింది. ఇపుడు దీని నుంచి మినహాయింపు లభించింది. దేశంలో ఎక్కడికైనా వెళ్లేందుకు రేవంత్‌కు హైకోర్టు అనుమతించింది. […]

Advertisement
Update:2015-09-08 08:36 IST
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, కొడంగల్‌ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్‌పై అవినీతి నిరోధక శాఖ కోర్టు విధించిన షరతులను ఎత్తి వేసింది. ఏసీబీ కేసుకు సంబంధించి గతంలో రేవంత్‌కు హైకోర్టు పలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. కొడంగల్ నియోజకవర్గంలోనే ఉండాలని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు లేదని కోర్టు షరతులు విధించింది. ఇపుడు దీని నుంచి మినహాయింపు లభించింది. దేశంలో ఎక్కడికైనా వెళ్లేందుకు రేవంత్‌కు హైకోర్టు అనుమతించింది. ఆ తరువాత షరతులను సడలింపు చేయాలంటూ రేవంత్ కోర్టును అభ్యర్థించారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన కోర్టు రేవంత్ బెయిల్‌ ఆదేశాల్లో సడలింపునిచ్చింది. కాగా కేసుకు సంబంధించిన అంశాలు మినహా ఇతర ఏ అంశాలపైనా మాట్లాడేందుకు కోర్టు అనుమతినిచ్చింది. కేసుకు సంబంధించి సాక్ష్యులను ప్రభావితం చేసినట్లు తమ దృష్టికి వస్తే షరతులను ఉపసంహరించుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏసీబీ కార్యాలయానికి హాజరుకావాలని రేవంత్‌రెడ్డిని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో కొడంగల్‌లో ఉన్న రేవంత్‌రెడ్డికి స్వేచ్ఛ లభించినట్టయ్యింది.
Tags:    
Advertisement

Similar News