తెలంగాణలో రెడ్ల లక్ష్యంగా దొరల దాడులు: రేవంత్
ప్రధానంగా రెడ్డి సామాజికవర్గాన్ని లక్ష్యం చేసుకుని తెలంగాణలో దాడులు జరుగుతున్నాయని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో జరిగిన గొడవ నేపద్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ దాడుల వెనుక కె.చంద్రశేఖరరావు తదితర దొరల కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి.కె.అరుణపై ఆరోపణలు చేయడం, నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై, మహబూబ్‌నగర్ జిల్లా […]
Advertisement
ప్రధానంగా రెడ్డి సామాజికవర్గాన్ని లక్ష్యం చేసుకుని తెలంగాణలో దాడులు జరుగుతున్నాయని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో జరిగిన గొడవ నేపద్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ దాడుల వెనుక కె.చంద్రశేఖరరావు తదితర దొరల కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి.కె.అరుణపై ఆరోపణలు చేయడం, నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై, మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో తనపై, ఇపుడు మహబూబ్‌నగర్ జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డిపై జరిగిన దాడులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుందని ఆయన విమర్శిచారు. దాడుల వెనక దొరల హస్తం ఉందనడానికి ఇంతకన్నా ఆధారాలేమి కావాలని ఆయన ప్రశ్నించారు. ఒకే సామాజిక వర్గాన్ని ఎంచుకొని వరుసగా దాడులు చేయిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన దాడి వెనుక మంత్రి జూపల్లి హస్తం ఉందని రేవంత్ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే వారిపై కేసీఆర్, హరీశ్‌రావులు దాడులకు ప్రోత్సహిస్తున్నారని, బయట తమతమ సామాజిక వర్గం అండదండలతో కొందరి నాయకులను రెడ్ల మీదకి ఉసిగొల్పుతున్నారని ఆయన అన్నారు. చిన్నారెడ్డిపై దాడి జరిగినప్పుడే కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించి ఉంటే నేడు రాంమోహన్‌రెడ్డిపై దాడి జరిగి ఉండేదికాదని ఆయన అన్నారు.
Advertisement