కృష్ణా పుష్కరాలకు నివేదిక ఇవ్వండి: బాబు

2016 ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు సమగ్ర నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేను ఆదేశించారు. హైదరాబాద్‌లో బుధవారం సీఎం చంద్రబాబు కలెక్టర్‌ కాంతిలాల్‌దండేతో చర్చించారు. గుంటూరు జిల్లాలోని కృష్ణా నదీతీర ప్రాంతంలో ఉన్న రేవులను పరిశీలించి పూర్తి స్థాయిలో మౌలిక వసతులను మెరుగుపరచడానికి అధికారులతో చర్చించాలన్నారు. కృష్ణా పుష్కరాలు 2016 ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని, కలెక్టర్‌ దండే దీనికి సంబంధించి అన్ని శాఖలతో చర్చిస్తామని సీఎం […]

Advertisement
Update:2015-09-04 02:01 IST
2016 ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు సమగ్ర నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేను ఆదేశించారు. హైదరాబాద్‌లో బుధవారం సీఎం చంద్రబాబు కలెక్టర్‌ కాంతిలాల్‌దండేతో చర్చించారు. గుంటూరు జిల్లాలోని కృష్ణా నదీతీర ప్రాంతంలో ఉన్న రేవులను పరిశీలించి పూర్తి స్థాయిలో మౌలిక వసతులను మెరుగుపరచడానికి అధికారులతో చర్చించాలన్నారు. కృష్ణా పుష్కరాలు 2016 ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని, కలెక్టర్‌ దండే దీనికి సంబంధించి అన్ని శాఖలతో చర్చిస్తామని సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ నెల 5వ తేదీ శుక్రవారం సీఆర్‌డీఏ సమావేశం తర్వాత కృష్ణా పుష్కరాలపై కూడా చర్చించాలని నిర్ణయించారు.
Tags:    
Advertisement

Similar News