తెలుగు రాష్ర్టాలకు 9 మంది 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌లు

తెలుగు రాష్ర్టాలకు తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 బ్యాచ్‌కు చెందిన వారిలో ఐదుగురిని ఆంధ్రకు, నలుగురిని తెలంగాణ రాష్ర్టానికి కేటాయించారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన వారిని కర్ణాటకకు, చత్తీస్‌గఢ్‌కు, బీహార్‌కు, తమిళనాడుకు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని కేరళ, బెంగాల్‌, యూపీ, నాగాలాండ్‌, అసోంకు మరొకరిని కేంద్రపాలిత ప్రాంతానికి పంపారు. ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకాంత్‌ వర్మ, డీకే బాలాజీ, హరేంధిక ప్రసాద్‌, అభిషిక్త కిశోర్‌, వినోద్‌కుమార్‌ను కేటాయించగా… గౌతమ్‌, పమేల్‌ […]

Advertisement
Update:2015-09-03 01:09 IST
తెలుగు రాష్ర్టాలకు తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 బ్యాచ్‌కు చెందిన వారిలో ఐదుగురిని ఆంధ్రకు, నలుగురిని తెలంగాణ రాష్ర్టానికి కేటాయించారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన వారిని కర్ణాటకకు, చత్తీస్‌గఢ్‌కు, బీహార్‌కు, తమిళనాడుకు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని కేరళ, బెంగాల్‌, యూపీ, నాగాలాండ్‌, అసోంకు మరొకరిని కేంద్రపాలిత ప్రాంతానికి పంపారు. ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకాంత్‌ వర్మ, డీకే బాలాజీ, హరేంధిక ప్రసాద్‌, అభిషిక్త కిశోర్‌, వినోద్‌కుమార్‌ను కేటాయించగా… గౌతమ్‌, పమేల్‌ సత్‌పతి, అనురాగ్‌ జయంతి, రాహుల్‌ రాజ్‌లను తెలంగాణకు కేటాయించారు. తెలంగాణకు చెందిన మహ్మద్‌ రోషన్‌, బీ సుశీలను కర్ణాటకకు, సుంకర రాజగోపాల్‌, క్రాంతికుమార్‌లను తమిళనాడుకు, రాహుల్‌ వెంకట్‌ ఛత్తీ్‌సగఢ్‌కు, ప్రశాంత్‌కుమార్‌ బీహార్‌కు నియమితులయ్యారు. ఏపీకి చెందిన మైలవరపు తేజ కేరళకు, లక్ష్మీ భవ్య, పల్లె శ్రీకాంత్‌లు బెంగాల్‌కు, అమన్‌ దీప్‌ యూపీకి, ద్విదిత రెడ్డి కేంద్ర పాలిత ప్రాంత కేడర్‌కు, మేకల చైతన్య ప్రసాద్‌ నాగాలాండ్‌కు, విజయభాస్కర్‌ రెడ్డి అసోంకు నియమితులయ్యారు.
ఏపీకి మరో ఐఆర్‌ఎస్‌ అధికారి
ఆదాయ పన్ను శాఖకు చెందిన జాస్తి కృష్ణ కిశోర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి డిప్యుటేషన్‌పై వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయ పన్ను కమిషనర్‌గా పనిచేసిన కృష్ణ కిశోర్‌ కొంతకాలంపాటు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు పర్సనల్‌ సెక్రటరీగా పనిచేశారు. విదేశీ శిక్షణ అనంతరం ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లడానికి ఆయన చేసిన దరఖాస్తును కేంద్రం ఆమోదించింది.
Tags:    
Advertisement

Similar News