'ఎర్ర' డ్రైవర్ ఆస్తి రూ. 200 కోట్లు
ఇరవై ఏళ్లుగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ 200 కోట్లకుపైగా సంపాదించిన ఓ లారీ డ్రైవర్‌ను కడప పోలీసులు అరెస్టు చేశారు. తిమ్మసముద్రం వెంకటరెడ్డి అనే ఈ డ్రైవర్‌తో పాటు కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన జంగాల వీరభద్రయ్య, చిట్వేలికి చెందిన కందుల రాజమోహన్‌రెడ్డి, వెంకటరెడ్డి సోదరుడి కుమారుడు చెంగల్‌రెడ్డి, తమిళనాడుకు చెందిన మహమ్మద్ అలీని కూడా అరెస్టు చేశారు. కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేట బ్రిడ్జి సమీపంలో యాంటీ స్మగ్లింగ్ ప్రత్యేక దళం వీరిని పట్టుకుని […]
Advertisement
ఇరవై ఏళ్లుగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ 200 కోట్లకుపైగా సంపాదించిన ఓ లారీ డ్రైవర్‌ను కడప పోలీసులు అరెస్టు చేశారు. తిమ్మసముద్రం వెంకటరెడ్డి అనే ఈ డ్రైవర్‌తో పాటు కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన జంగాల వీరభద్రయ్య, చిట్వేలికి చెందిన కందుల రాజమోహన్‌రెడ్డి, వెంకటరెడ్డి సోదరుడి కుమారుడు చెంగల్‌రెడ్డి, తమిళనాడుకు చెందిన మహమ్మద్ అలీని కూడా అరెస్టు చేశారు. కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేట బ్రిడ్జి సమీపంలో యాంటీ స్మగ్లింగ్ ప్రత్యేక దళం వీరిని పట్టుకుని వీరి నుంచి 2.2 టన్నుల 171 దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు కడప ఎస్పీ నవీన్ గులాఠీ తెలిపారు. వీరంతా కూడా కోట్లకు పడగలెత్తిన స్మగ్లర్లేనని, వీరిచ్చిన సమాచారం మేరకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగరం గోడౌన్‌పై దాడి చేసి అక్కడ నిల్వ ఉంచిన 14 కిలోల ఎర్రచందనం పూసలు, మూడు కార్లు, ట్యాంకరు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని గోడౌన్‌ను సీజ్ చేశామని ఆయన తెలిపారు.
Advertisement