భారత్, పాక్‌లలో భూకంపం!
ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్‌లోను, ఖజకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ దేశాల్లోను ఈ భూకంపం ప్రజల్ని భయబ్రాంతుల్ని చేసింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లోని రావల్పిండి, లాహోర్, సర్గోద, హరిపూర్ వంటి నగరాల్లో భూమి కంపించింది. అలాగే పెషావర్, మార్దాన్, పరిచయినర్, అబోట్టాబాద్, స్వాభిలలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయని ఇంటర్నేషనల్ ఆసియన్ న్యూస్ ఏజన్సీ తెలిపింది. దీంతో ప్రజలు […]
Advertisement
ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్‌లోను, ఖజకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ దేశాల్లోను ఈ భూకంపం ప్రజల్ని భయబ్రాంతుల్ని చేసింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లోని రావల్పిండి, లాహోర్, సర్గోద, హరిపూర్ వంటి నగరాల్లో భూమి కంపించింది. అలాగే పెషావర్, మార్దాన్, పరిచయినర్, అబోట్టాబాద్, స్వాభిలలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయని ఇంటర్నేషనల్ ఆసియన్ న్యూస్ ఏజన్సీ తెలిపింది. దీంతో ప్రజలు తీవ్రంగా భయపడిపోయారు. ప్రకంపనల తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప కేంద్రం హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రిక్టర్ స్కేల్‌పై 6.2గా భూకంప తీవ్రత నమోదైంది.
Advertisement