మర్రి ఆరోపణలు నిజమేనా!
హైదరాబాద్‌లో ఓటుకు ఆధార్ అనుసంధానం ఊపందుకున్నవేళ మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. నగరంలో ఉన్నసెటిలర్ల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. మర్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక అసలు ఉద్దేశం ఆయన సనత్‌నగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తుండటమే! తలసాని రాజీనామా చేసింది లగాయతు ఈ స్థానంలో ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందా? అని అందరికంటే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తోంది మర్రి శశిధరే! 2014లోనే ఆయన ఇదే స్థానం నుంచి […]
Advertisement
హైదరాబాద్‌లో ఓటుకు ఆధార్ అనుసంధానం ఊపందుకున్నవేళ మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. నగరంలో ఉన్నసెటిలర్ల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. మర్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక అసలు ఉద్దేశం ఆయన సనత్‌నగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తుండటమే! తలసాని రాజీనామా చేసింది లగాయతు ఈ స్థానంలో ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందా? అని అందరికంటే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తోంది మర్రి శశిధరే! 2014లోనే ఆయన ఇదే స్థానం నుంచి పోటీచేసి తలసాని చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు తలసాని టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్‌లో చేరి మంత్రి పదవి చేపట్టారు. 2014 ఎన్నికల్లో నగరంలో సెటిలర్లు పట్టం కట్టడంతో టీడీపీ10 సీట్లు గెలుచుకుంది. అందుకే ఓటుకు ఆధార్ అనుసంధానం విషయంలో మర్రి మొదటి నుంచి అభ్యంతరం లేవనెత్తుతున్నారు. తన ప్రత్యర్థి తాజాగా టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లో చేరడంతో దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని మర్రి యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 3 నెలల క్రితం టీడీపీ అధినేత బాబుకు అనుకూల వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న మర్రి ఇప్పడు ప్రత్యర్థిపై తన మాటల దాడిని రెట్టింపు చేశారు. ఇప్పటికే తలసాని రాజీనామాపై గవర్నర్, స్పీకర్‌లను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓట్ల తొలగింపుపై దృష్టి సారించారు. మర్రి తన ప్రత్యర్థిపై మానసికంగా సాగిస్తున్న యుద్ధం చివరివరకు ఇదే తరహాలో సాగుతుందా లేదా వేచి చూడాలి.
Advertisement