ఆంధ్రకూ జంట నగరాల రాజధాని?
అమరావతి- విజయవాడలపై చంద్రబాబు దృష్టి తెలంగాణకు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల రాజధాని ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్‌కూ రెండు నగరాల రాజధాని ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందించిన సింగపూర్ బృందానికి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సూచనలు కూడా అందించిందని అధికార వర్గాలంటున్నాయి. 12 కిలోమీటర్ల దూరంలో రెండు నగరాలను కలిపి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ – సికిందరాబాద్‌లను తలదన్నేరీతిలో ఈ జంట నగరాలను నిర్మించాలని […]
Advertisement
అమరావతి- విజయవాడలపై చంద్రబాబు దృష్టి
తెలంగాణకు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల రాజధాని ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్‌కూ రెండు నగరాల రాజధాని ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందించిన సింగపూర్ బృందానికి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సూచనలు కూడా అందించిందని అధికార వర్గాలంటున్నాయి. 12 కిలోమీటర్ల దూరంలో రెండు నగరాలను కలిపి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ – సికిందరాబాద్‌లను తలదన్నేరీతిలో ఈ జంట నగరాలను నిర్మించాలని చంద్రబాబు చాలా పట్టుదలగా ఉన్నారని అధికారవర్గాలంటున్నాయి. హైదరాబాద్‌లో టాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ రెండు నగరాలను విడదీస్తున్నాయి. అదే రీతిలో అమరావతి – విజయవాడ నగరాల మధ్య 12 కిలోమీటర్ల మేర సుందరమైన పార్కులను, ఫౌంటెన్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఒకవైపు అమరావతిని నిర్మిస్తూనే విజయవాడలో మౌలికసదుపాయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేది ప్రణాళికలో ఉంది. విజయవాడను అభివృద్ధి చేయడానికి గాను ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సింగపూర్ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని అధికారవర్గాలంటున్నాయి.
Advertisement