ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు: రాహుల్‌

ప్రత్యేక హోదా కోరడం ఆధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు అని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఈ హక్కును కాంగ్రెస్‌ పార్టీ కల్పించిందని, దీన్ని వెనక్కి లాక్కునేందుకు కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఓబుల దేవర చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ్‌ సభలో రాహుల్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో […]

Advertisement
Update:2015-07-24 08:24 IST
ప్రత్యేక హోదా కోరడం ఆధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు అని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఈ హక్కును కాంగ్రెస్‌ పార్టీ కల్పించిందని, దీన్ని వెనక్కి లాక్కునేందుకు కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఓబుల దేవర చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ్‌ సభలో రాహుల్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారని… మోదీని ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. కాంగ్రెస్‌ ఎవరికీ భయపడదన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కాంగ్రెస్‌ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పోరాటంలో మీరు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని రాహులు తెలిపారు. ఆంధ్రాతో ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధమే తనకు ఉందన్నారు. ఆమె రక్తమే తనలోనూ ప్రవహిస్తుందని ఆయన అన్నారు. ఏపీ అగ్రగామిగా ఉండాలంటే ప్రత్యేక హోదా, పోలవరం అవసరమన్నారు. మీ భవిష్యత్‌ను పణంగా పెడుతూ స్వార్థ రాజకీయాలను చేస్తున్న టీడీపీ, వైసీపీలా తాము రాజీపడబోమని రాహుల్‌ గాంధీ అన్నారు.
రైతుల భూములను బలవంతంగా లాక్కోడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తెచ్చే పనిలో ఉందని, దీన్ని అడ్డుకుని తీరతామని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. రైతుల భూములు బలవంతంగా తీసుకోకుండా తాము చట్టం తెచ్చామని చెప్పారు. కేంద్రం రైతన్నల భూములు లాక్కోడానికి ఆ చట్టాన్ని సవరించాలని చూస్తోందని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకే భూసేకరణ బిల్లును తీసుకువస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ బిల్లు విషయంలో మోదీ సర్కారు తలొగ్గకతప్పదన్నారు. ప్రజలు తననేమీ చేయలేరని మోదీ అనుకుంటున్నారన్నారు. రైతాంగం కష్టాలు తీరేవరకూ పోరాడుతామని రాహుల్‌ స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకే వచ్చానన్నారు. రైతు కుటుంబాలు ఎంత బాధలో ఉన్నాయో తెలుసని… రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులు, పేదల బతుకులకు భరోసా లేదన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉండలేకపోతుందని విమర్శించారు. ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న రాహుల్‌ ముందుగా దివంగత నేత రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరాగాంధీ సభ నిర్వహించిన చోట మొక్క నాటారు. ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్‌ 49 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందజేశారు.
రాహుల్‌ రైతు భరోసా యాత్ర ప్రారంభం
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ ఓబులదేవరచెరువు నుంచి రైతు భరోసాయాత్రను ప్రారంభించారు. మామిళకుంటపల్లి, దేబురాపల్లి, కొండకమర్ల గ్రామాల మీదుగా పది కిలోమీటర్ల మేర సాగుతున్న ఈ పాదయాత్రలో రాహుల్‌ వెంట కాంగ్రెస్‌ నేతలు చిరంజీవి, రఘువీరారెడ్డి, సుబ్సిరామిరెడ్డి, రామచంద్రయ్య, శైలజానాథ్‌, కొండ్రు మురళిలు ఉన్నారు. మొదట కొలికొండ్ల చేరిన రాహుల్‌కు కాంగ్రెస్‌ నేతలు రఘువీరా, జేడీ శీలం, పల్లంరాజు, కేవీపీ, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మీలు స్వాగతం పలికారు. ఓబుల్‌దేవర చెరువులో మొక్క నాటిన రాహుల్‌ పాదయాత్రను ప్రారంభించారు.
Tags:    
Advertisement

Similar News