భారీగా తగ్గనున్న పెట్రో ధరలు!
వాహన వినియోగదారులకు శుభవార్త. అతిత్వరలో పెట్రోలు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని పెట్రో, డీజిల్ ధరల విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్ల మన దేశంలో కూడా పెట్రోలు ధరలు కూడా భారీగా తగ్గే అవకాశముందని, దీనిపై ప్రభుత్వం వచ్చవారంలో జరగనున్న ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థల సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని వారు భావిస్తున్నారు. ఈనెల మొదటి వారంలో పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 71 పైసలు తగ్గించిన ప్రభుత్వం మరోసారి […]
Advertisement
వాహన వినియోగదారులకు శుభవార్త. అతిత్వరలో పెట్రోలు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని పెట్రో, డీజిల్ ధరల విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్ల మన దేశంలో కూడా పెట్రోలు ధరలు కూడా భారీగా తగ్గే అవకాశముందని, దీనిపై ప్రభుత్వం వచ్చవారంలో జరగనున్న ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థల సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని వారు భావిస్తున్నారు. ఈనెల మొదటి వారంలో పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 71 పైసలు తగ్గించిన ప్రభుత్వం మరోసారి వీటి ధరలను భారీగా తగ్గిస్తే వాహనదారులకు శుభవార్తే. గ్రీసు ఆర్థిక సంక్షోభం, ఇరాన్‌తో భారత్ జరిపిన చర్చల్లో పురోగతి, డాలర్ బలోపేతంతో పాటు చైనా మార్కెట్లు తగ్గుముఖం పట్టడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర క్షీణించింది. అందువల్ల మనదేశంలో కూడా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Advertisement