చంద్రబాబు కులచిచ్చు రేపుతున్నారా?
తమ నేతలను వేధించడానికి ఏపీ సీఎం చంద్రబాబు కులరాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ ఆర్ సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో పార్టీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి అరెస్టు ఉదంతమే ఇందుకు తాజా ఉదాహరణ అని ఆరోపిస్తున్నారు. భూమానాగిరెడ్డి అరెస్టును ఖండిస్తూ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమేంటని వాపోయారు. కర్నూలు జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న భూమాను […]
తమ నేతలను వేధించడానికి ఏపీ సీఎం చంద్రబాబు కులరాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ ఆర్ సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో పార్టీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి అరెస్టు ఉదంతమే ఇందుకు తాజా ఉదాహరణ అని ఆరోపిస్తున్నారు. భూమానాగిరెడ్డి అరెస్టును ఖండిస్తూ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమేంటని వాపోయారు. కర్నూలు జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న భూమాను రాజకీయంగా దెబ్బతీయడానికే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. గతంలోనూ భూమాపై రౌడీషీట్ ఓపెన్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి కేసులతో తామ భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు కులరాజకీయాలతో చిచ్చు రేపాలని చూస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలోనూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చూసిన సంస్కృతి చంద్రబాబు నాయుడిదని విమర్శించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసే చంద్రబాబు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పోలీసులు సైతం ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే భూమానాగిరెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తివేసి ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.