చమురు సంస్థలకు ఉగ్రవాదుల ముప్పు
తీరప్రాంతంలోని చమురు సంస్థలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంది. అందువల్ల తీరప్రాంత రక్షణ, చమురు సంస్థల భద్రతపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ డీజీపీ రాముడు అన్నారు. తీరప్రాంత భద్రత సమన్వయ కమిటీ 29వ సమావేశం మంగళవారం విశాఖ పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ రాముడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ వంటి చమురు సంస్థలపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని అందువల్ల తీర ప్రాంత రక్షణ, భద్రతను […]
తీరప్రాంతంలోని చమురు సంస్థలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంది. అందువల్ల తీరప్రాంత రక్షణ, చమురు సంస్థల భద్రతపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ డీజీపీ రాముడు అన్నారు. తీరప్రాంత భద్రత సమన్వయ కమిటీ 29వ సమావేశం మంగళవారం విశాఖ పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ రాముడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ వంటి చమురు సంస్థలపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని అందువల్ల తీర ప్రాంత రక్షణ, భద్రతను పటిష్టం చేయాలన్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు ప్రజలను భాగస్వామ్యులను చేయాలని ఆయన అన్నారు.