'దేశం' ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైకాపా శ్రేణులు

తెలుగుదేశం ప్రభుత్వం రైతుల్ని నిలువునా మోసం చేసిందని, ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోలేదని, ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేస్తుందని ఆరోపిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. ఈసందర్భంగా ప్రధాన పట్టణాలైన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంతోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఆ పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కలెక్టరేట్లను ముట్టడించారు. చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు పెద్ద దొంగ […]

Advertisement
Update:2015-06-25 10:39 IST
తెలుగుదేశం ప్రభుత్వం రైతుల్ని నిలువునా మోసం చేసిందని, ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోలేదని, ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేస్తుందని ఆరోపిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. ఈసందర్భంగా ప్రధాన పట్టణాలైన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంతోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఆ పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కలెక్టరేట్లను ముట్టడించారు. చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు పెద్ద దొంగ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు భూమన కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తన స్వార్థం కోసం ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దపు హామీలతో సీఎం అయిన చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని వారన్నారు. విశాఖపట్నంలో ధర్నా నిర్వహిస్తున్న వైసీపీ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ధర్నా సందర్బంగా కలెక్టర్‌, ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై ఎసీపీ రమణ దౌర్జన్యానికి దిగారు. అధికారులు లేకపోవడంతో గోడకు వీరు అతికించిన వినతిపత్రాన్ని ఏసీపీ రమణ చించేశారు. దీంతో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మద్య స్వల్ప వివాదం ఏర్పడింది. తనపై దౌర్జన్యం చేసిన ఏసీపీ రమణపై తాను గవర్నర్‌కు, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ఈశ్వరి అన్నారు.
అనంతపురంలో వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రుణ మాపీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారని, బాబు ప్రభుత్వం అవినీతిలో మగ్గిపోతుందని ఆరోపించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు జరిగాయి. తూర్పులో జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌, జక్కంపూడి విజయలక్ష్యి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పాల్గొని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. పశ్చిమ జిల్లాలో వంకా రవీంద్రనాథ్‌, తలారి వెంకట్రావు, కారుమంచి రమేష్‌, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొన్నారు. విశాఖలో జరిగిన కలెక్టరేట్‌ ముట్టడి, మహాధర్నాలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషాకిరణ్‌, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావులు, ఎమ్మెల్యేలు కళావతి, కంబాల జోగులు పాల్గొన్నారు. విజయనగరంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే రాజేంద్ర దొర, పెన్మత్స సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా కలెక్టరేట్ల ముట్టడి, మహా ధర్నాలు జరిగాయి. కృష్ణాలో కొడాలి నాని, మేకా ప్రతాప్‌ అప్పారావు, జలీల్‌ ఖాన్‌, కె.పార్థసారధి, గౌతంరెడ్డి, గుంటూరు జిల్లాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్‌ తదితరులు పాల్గొని కార్యక్రమాల్ని విజయవంతం చేశారు.
Tags:    
Advertisement

Similar News