ఫోరెన్సిక్ రిపోర్ట్ నేపధ్యంలో గవర్నర్ ఢిల్లీకి...?
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు ఢిల్లీ హోం శాఖ నుంచి పిలుపు వచ్చింది. దీన్ని పురస్కరించుకుని ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8 వివాదాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆ గొంతు చంద్రబాబుదే అని నిర్ధారణ కావటం, దానిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, తదనంతరం సంభవించబోయే పరిణామాలపై గవర్నర్‌తో కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సెక్షన్ 8 అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే […]
Advertisement
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు ఢిల్లీ హోం శాఖ నుంచి పిలుపు వచ్చింది. దీన్ని పురస్కరించుకుని ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8 వివాదాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆ గొంతు చంద్రబాబుదే అని నిర్ధారణ కావటం, దానిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, తదనంతరం సంభవించబోయే పరిణామాలపై గవర్నర్‌తో కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సెక్షన్ 8 అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అటార్నీ జనరల్ సలహాను గవర్నర్ కోరారు. ఈక్రమంలో గవర్నర్‌తో సంప్రదింపులు జరపడానికి ఆయన్ను పిలిచినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వెళుతున్న గవర్నర్ మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను, ప్రధాని మోడితో భేటీ అయ్యే అవకాశం ఉంది.
Advertisement