మంత్రి కోసం రూటు మారిన భోగాపురం?
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం మరో వివాదంలో చిక్కుకుంది. అకస్మాత్తుగా విమానాశ్రయరూటు మారిపోయింది. పెద్దల భూములను కాపాడేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఎప్పటిలానే పెద్దల ప్రయోజనాల కోసం పేదలు బలి కాబోతున్నారు. కొత్తగా ప్రతిపాదించిన మ్యాప్‌లో పెద్దల భూములకు పూర్తి రక్షణ కల్పించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 15 వేల ఎకరాల్లో నిర్మిస్తామని చంద్రబాబు సర్కారు మొదట్లో ప్రకటించింది. అప్పుడు చేసిన ప్రతిపాదనలలో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు వాటాలున్న బడా రియల్ ఎస్టేట్ సంస్థ ‘సన్‌రే’ భూములు […]
Advertisement
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం మరో వివాదంలో చిక్కుకుంది. అకస్మాత్తుగా విమానాశ్రయరూటు మారిపోయింది. పెద్దల భూములను కాపాడేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఎప్పటిలానే పెద్దల ప్రయోజనాల కోసం పేదలు బలి కాబోతున్నారు. కొత్తగా ప్రతిపాదించిన మ్యాప్‌లో పెద్దల భూములకు పూర్తి రక్షణ కల్పించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 15 వేల ఎకరాల్లో నిర్మిస్తామని చంద్రబాబు సర్కారు మొదట్లో ప్రకటించింది. అప్పుడు చేసిన ప్రతిపాదనలలో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు వాటాలున్న బడా రియల్ ఎస్టేట్ సంస్థ ‘సన్‌రే’ భూములు కూడా ఉన్నాయి. ఆయనతో పాటు చాలామంది పెద్దలకు చెందిన వేలాది ఎకరాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత పెద్దలంతా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో విమానాశ్రయం రూటు మారిపోయింది. కొత్త ప్రతిపాదనలు పుట్టుకొచ్చాయి. జిల్లా మంత్రి కిమిడి మృణాళిని కొత్త మ్యాప్‌ను ప్రకటించారు. ఎయిర్‌పోర్టు కోసం 5,040 ఎకరాలే తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఎయిర్‌పోర్టు అథారిటీ సూచన మేరకే ఈ మార్పు చేశామని ఆమె ప్రకటించారు. భూసేకరణ ద్వారా కొంత భూమి, భూసమీకరణ ద్వారా మరికొంత భూమి తీసుకుంటామని తెలిపారు. ‘సన్‌రే’కు దిబ్బలపాలెం, ఎ.రాయవలస గ్రామాల్లోనూ, ఈ ప్రాంతానికి చెందిన బడా రాజకీయ నాయకులకు తూడేం, కవులవాడ, కంచేరు గ్రామాల్లోనూ భూములున్నాయి. వీటిలో నాలుగు గ్రామాలను ఎయిర్‌పోర్టు కొత్త మ్యాప్ నుంచి పూర్తిగా తప్పించారు. ఎ.రాయవలసలో సన్‌రేకు ఉన్న భూములను మినహాయించారు. కొత్తగా ముంజేరు, గూడపువలస, బైరెడ్డిపాలెం, భోగాపురం తూర్పు తదితర ఎనిమిది రెవెన్యూ గ్రామాలను చేర్చారు. ఇక్కడ అందరూ 50 సెంట్ల నుంచి ఎకరం లోపు ఉన్న పేద రైతులే. కొత్తగా చేర్చిన గ్రామాల పరిధిలో జిరాయితీ భూములు 3,873 ఎకరాలు, ప్రభుత్వ భూములు 1,100 ఎకరాలకుపైగా ఉన్నాయి. ఈ ప్రాంత ప్రభుత్వ భూములను పేదలు సాగు చేసుకుంటున్నారు. వారి ఆధీనంలోనే ఈ భూములున్నాయి. 10 సెంట్లు, 15 సెంట్ల భూముల్లో పంటలు పండించుకుంటున్న వేలాది మంది పేద రైతుల భూములను లాక్కోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూముల సమీకరణ, సేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఉద్యమ బాట పడ్డారు. దీనికితోడు పెద్దల భూములను తప్పిస్తూ పేదల భూములను చేర్చుతూ తాజాగా రూపొందించిన మ్యాప్ పట్ల బాధిత గ్రామాల్లో మరింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఉద్యమం రానున్న రోజుల్లో మరింత ఉధృతమయ్యే అవకాశాలున్నాయి.
Advertisement