హైదరాబాద్ ను కేంద్ర పాలితప్రాంతం చేయండి...
ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇపుడు కొత్త వాదనను తెర మీదకు తెస్తున్నారు. సెక్షన్ 8 చెల్లదని అంటున్న తెలంగాణ సర్కారుకు రాష్ట్ర విభజన చట్టంపై గౌరవం లేనట్టేనని విమర్శిస్తున్నారు. చట్టంలోని ఒక సెక్షన్ చెల్లదన్నప్పుడు విభజన చట్టం కూడా చెల్లుబాటు కాదని ఒప్పుకోవాలని, తమకు పెత్తనాన్ని కట్టబట్టే వాటిని అట్టిపెట్టుకుని మిగతావి చెల్లవని అంటారా అని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. సెక్షన్ 8ని అంగీకరించకుండా ఉద్యమాలు చేస్తాం… సమ్మెలు చేస్తాం… అంటే తాము కూడా […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇపుడు కొత్త వాదనను తెర మీదకు తెస్తున్నారు. సెక్షన్ 8 చెల్లదని అంటున్న తెలంగాణ సర్కారుకు రాష్ట్ర విభజన చట్టంపై గౌరవం లేనట్టేనని విమర్శిస్తున్నారు. చట్టంలోని ఒక సెక్షన్ చెల్లదన్నప్పుడు విభజన చట్టం కూడా చెల్లుబాటు కాదని ఒప్పుకోవాలని, తమకు పెత్తనాన్ని కట్టబట్టే వాటిని అట్టిపెట్టుకుని మిగతావి చెల్లవని అంటారా అని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. సెక్షన్ 8ని అంగీకరించకుండా ఉద్యమాలు చేస్తాం… సమ్మెలు చేస్తాం… అంటే తాము కూడా చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అసలు ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఈ వివాదాలే ఉండవని ఆయన అన్నారు. సెక్షన్ 8 అమలు చేయడం కుదరదు అంటే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్రాన్ని కోరతామని రవీంద్ర చెప్పారు. హైదరాబాద్‌లో పదేళ్లపాటు ఇద్దరికీ అధికారాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల విషయంలో గవర్నర్‌కు పూర్తి అధికారం ఉందన్నారు. సెక్షన్ 8 అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు.
Advertisement