యుద్ధ వాతావరణంలో "కృష్ణా"పై నిర్ణయం
కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి అమర్జిత్ నేతృత్వంలో రెండు రోజులపాటు జరిగిన కృష్ణా బోర్డు సమావేశం దాదాపు యుద్ధ వాతావరణాన్నే తలపించింది. నాగార్జునసాగర్ వద్ద పోలీసుల మోహరింపు నుంచి గత ఏడాదిగా జరిగిన పరిణామాలను ఇరు రాష్ట్రాల అధికారులు వివరించారు. కొన్ని అంశాలపై తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత… తెలంగాణ 299 టీఎంసీలను, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీల నికర జలాలను వాడుకోవచ్చని అమర్జిత్ సింగ్ ప్రకటించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం […]
Advertisement
కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి అమర్జిత్ నేతృత్వంలో రెండు రోజులపాటు జరిగిన కృష్ణా బోర్డు సమావేశం దాదాపు యుద్ధ వాతావరణాన్నే తలపించింది. నాగార్జునసాగర్ వద్ద పోలీసుల మోహరింపు నుంచి గత ఏడాదిగా జరిగిన పరిణామాలను ఇరు రాష్ట్రాల అధికారులు వివరించారు. కొన్ని అంశాలపై తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత… తెలంగాణ 299 టీఎంసీలను, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీల నికర జలాలను వాడుకోవచ్చని అమర్జిత్ సింగ్ ప్రకటించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు దక్కేది 279 టీఎంసీలేనని, మిగిలిన 20 టీఎంసీలు షరతులతో కూడిన కేటాయింపులని వివరించారు. నికర జలాలను ప్రాజెక్టులు వారీగా వాడుకోవాలే తప్ప.. ఒక దగ్గర ఆదా చేసుకుని మరో దగ్గర వాడుకుంటామంటే అంగీకరించేది లేదని ఏపీ స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి దానికీ అడ్డు చెబితే ఎలా అంటూ ప్రశ్నించారు. దాంతో సమావేశపు చర్చల రికార్డులో ఇరుపక్షాల వాదనలను అధికారికంగా చేర్చాలని ఏపీ పట్టుబట్టింది.
హద్దు మీరితే కేంద్రం కట్టడి
కృష్ణా జలాల వినియోగంపై తాజాగా కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి నేతృత్వంలోని వర్కింగ్ కమిటీ ఆదేశాలను తుంగలో తొక్కవద్దని కమిటీ ఆదేశాలను ఏ రాష్ట్రం ఉల్లంఘించినా, సీఐఎస్‌ఎఫ్ బలగాలను రంగంలోకి దించి వాటి పర్యవేక్షణలో ఆదేశాలను అమలు చేస్తామని రెండు తెలుగు రాష్ట్రాలకూ కేంద్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది. పరిస్థితిని అంత దూరం తెచ్చుకోకుండా సమన్వయంతో వ్యవహరించాలని సూచించింది. కమిటీ ఆదేశాలను ఏ రాష్ట్రం పాటించదో.. ఏ అధికారి పాటించరో వారిపై పొరుగు రాష్ట్రం తమకు ఫిర్యాదు చేస్తే తాము తక్షణం రంగంలోకి దిగి కేంద్ర బలగాల పర్యవేక్షణలో కమిటీ ఆదేశాలను అమలు చేసి తదనుగుణంగా నీరు విడుదలయ్యేలా చూస్తామని కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి అమర్జిత్ సింగ్ తేల్చి చెప్పారు. ఆయా రాష్ర్టాల కృష్ణా జలాల హక్కులపై ఏ రాష్ర్టానికైనా అభ్యంతరాలు ఉంటే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించుకునే స్వేచ్ఛ వాటికి ఉందని స్పష్టం చేశారు.
Advertisement