తెలంగాణకు హడ్కో సాయం: కేటీఆర్
తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు హడ్కో సహకరిస్తుందని తెలంగాణ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగా గురువారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టబోతున్న గృహ నిర్మాణానికి తమకు సహకరించాల్సిందిగా వెంకయ్యనాయుడ్ని కోరానని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే రహదారులు, టాయిలెట్ల నిర్మాణానికి 8 లక్షల టన్నుల సిమెంట్ అవసరముందని, దీన్ని సబ్సిడీపై ఇవ్వాలని కోరామని కేటీఆర్ తెలిపారు. సిద్ధిపేటను క్లాస్-ఒన్ సిటీల జాబితాలో చేర్చాల్సిందిగా తాను కేంద్ర పట్టణాభిశాఖ మంత్రి […]
Advertisement
తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు హడ్కో సహకరిస్తుందని తెలంగాణ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగా గురువారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టబోతున్న గృహ నిర్మాణానికి తమకు సహకరించాల్సిందిగా వెంకయ్యనాయుడ్ని కోరానని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే రహదారులు, టాయిలెట్ల నిర్మాణానికి 8 లక్షల టన్నుల సిమెంట్ అవసరముందని, దీన్ని సబ్సిడీపై ఇవ్వాలని కోరామని కేటీఆర్ తెలిపారు. సిద్ధిపేటను క్లాస్-ఒన్ సిటీల జాబితాలో చేర్చాల్సిందిగా తాను కేంద్ర పట్టణాభిశాఖ మంత్రి వెంకయ్యనాయుడుని కోరానని ఆయన చెప్పారు. తెలంగాణలో వెయ్యి కిలోమీటర్ల రహదారులను నేషనల్ హైవేస్‌గా గుర్తించాలని కోరినట్టు కేటీఆర్ చెప్పారు. టీడీపీ నేతలకు గత పదిహేను రోజులుగా ఏం చేయాలో తెలియడం లేదని, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తెలుగుదేశం నేతలు తప్పు చేసినట్టు తెలుసుకున్నారని, ఆ బురదలోకి అందర్నీ లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో అందరూ ప్రశాంతంగా అన్నదమ్ముల్లా బతుకుతున్నారని, చంద్రబాబు లేనిపోని ప్రకటనలు చేస్తూ శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Advertisement