8 ప్లస్ 8 ఇక్వల్ టూ జీరో
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు సాధించింది గుండు సున్నా అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్;
Advertisement
''ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్లస్ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఇక్వల్ టూ జీ ఫర్ తెలంగాణ'' అని ఎమ్మెల్సీ కవిత కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తారు. 2025 -26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే అని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు చెరిసమానంగా ఎంపీ సీట్లు ఇచ్చినా వాళ్లంతా కలిసి రాష్ట్రానికి తెచ్చిందేమి లేదని.. ఎప్పటి మాదిరిగానే నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష కొనసాగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement