వరంగల్ ఎంపీ స్థానానికి అభ్యర్థి ఎవరు?
ఎంపీ పదవికి కడియం శ్రీహరి గురువారం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడియం విజయం సాధించారు. పైగా రాష్ర్టంలో మంత్రిగా విద్యాశాఖను నిర్వర్తిస్తున్నారు. దీంతో ముందుగా ఊహించినట్లుగానే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాబట్టి వరంగల్ ఎంపీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ బరిలో నిలిచేందుకు టీఆర్ ఎస్ ఎవరికి అవకాశం ఇస్తుందన్న చర్చ పార్టీలో ఊపందుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తులకు అవకాశం ఇవ్వాలా? […]
Advertisement
ఎంపీ పదవికి కడియం శ్రీహరి గురువారం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడియం విజయం సాధించారు. పైగా రాష్ర్టంలో మంత్రిగా విద్యాశాఖను నిర్వర్తిస్తున్నారు. దీంతో ముందుగా ఊహించినట్లుగానే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాబట్టి వరంగల్ ఎంపీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ బరిలో నిలిచేందుకు టీఆర్ ఎస్ ఎవరికి అవకాశం ఇస్తుందన్న చర్చ పార్టీలో ఊపందుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తులకు అవకాశం ఇవ్వాలా? లేకుంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి చాన్స్ ఇద్దామా అని టీఆర్ ఎస్ అధిష్టానం ఆలోచనలో ఉంది. సొంతపార్టీ నుంచి ఈ ఎన్నికపై పలువురు ప్రముఖులు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ విద్యార్ధి విభాగం నుంచి రాష్ర్ట స్థాయి నేతగా ఎదిగిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. అదే సమయంలో గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేసి ఓడిపోయిన పిడమర్తి రవి కూడా ఈ స్థానంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకుల్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ వివేక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దళిత సీఎం అభ్యర్థి అన్న నినాదంతో కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన ఆయన తరువాత పరిణామాలతో పార్టీకి దూరమయ్యారు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ టికెట్‌పైనే పెద్దపల్లి (కరీంనగర్) నుంచి పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. మరోవైపు కాంగ్రెస్‌లోనూ ఆయనకు తనకు సరైన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ ముగ్గరి పేర్లే వినిపిస్తున్నాయి.
Advertisement