రేవంత్‌రెడ్డి 12 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు
ఓటుకు నోటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ కుమార్తె నిశ్చితార్థం ఉన్న దృష్ట్యా ఆయన అభ్యర్థన మేరకు గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బెయిల్ అమలులో ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. కేసు విషయాలు మీడియాతో సహా ఎవరితోను మాట్లాడవద్దని, రాజకీయ సమావేశాలు పెట్టవద్దని న్యాయమూర్తి షరతు విధించారు. […]
Advertisement
ఓటుకు నోటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ కుమార్తె నిశ్చితార్థం ఉన్న దృష్ట్యా ఆయన అభ్యర్థన మేరకు గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బెయిల్ అమలులో ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. కేసు విషయాలు మీడియాతో సహా ఎవరితోను మాట్లాడవద్దని, రాజకీయ సమావేశాలు పెట్టవద్దని న్యాయమూర్తి షరతు విధించారు. రేవంత్‌తోపాటు ఎస్కార్టు ఉండాలని ఆదేశించింది. ఉదయం నుంచి ఈ కేసుపై ఏసీబీ న్యాయవాదులు, రేవంత్ న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్‌పై తమ తమ వాదనలు వినిపించారు. తనను రాజకీయ కుట్రతో ఇరికించారని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపించగా… కేసు కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని అందుచేత నిందితుడికి బెయిల్ ఇవ్వవద్దని ప్రాసిక్యూషన్ తమ వాదనను వినిపించింది. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు మధ్యాహ్ననానికి వాయిదా వేశారు. తిరిగి మళ్ళీ కోర్టు కొలువు తీరిన తర్వాత న్యాయమూర్తి తీర్పు ఇస్తూ ప్రధాన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. రేవంత్‌కు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. దీంతో రేవంత్‌కు కుమార్తె నిశ్చితార్థానికి హాజరయ్యే అవకాశం ఏర్పడింది.
Advertisement