గవర్నర్ అధికారాలపై మోడీతో చంద్రబాబు చర్చ
ఓటుకు నోటు కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసి రాష్ట్రంలో తాజా పరిణామాలను ఆయనకు వివరించారని తెలిసింది. వీరిద్దరి మధ్య సమావేశం గంటకు పైగా సాగింది. ముందుగా చంద్రబాబుతోపాటు ఆయనతో ఢిల్లీ వెళ్ళిన తెలుగుదేశం బృందం కూడా ఉంది. ఈ బృందంలో కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, ఆశోక్ గజపతిరాజుతోపాటు ఎంపీలు కొనకళ్ళ నారాయణ, తదితరులు ఉన్నారు. మొదట అందరితో మాట్లాడిన ప్రధాని ఆ తర్వాత చంద్రబాబుతో […]
Advertisement
ఓటుకు నోటు కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసి రాష్ట్రంలో తాజా పరిణామాలను ఆయనకు వివరించారని తెలిసింది. వీరిద్దరి మధ్య సమావేశం గంటకు పైగా సాగింది. ముందుగా చంద్రబాబుతోపాటు ఆయనతో ఢిల్లీ వెళ్ళిన తెలుగుదేశం బృందం కూడా ఉంది. ఈ బృందంలో కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, ఆశోక్ గజపతిరాజుతోపాటు ఎంపీలు కొనకళ్ళ నారాయణ, తదితరులు ఉన్నారు. మొదట అందరితో మాట్లాడిన ప్రధాని ఆ తర్వాత చంద్రబాబుతో దాదాపు ఇరవై నిమషాలపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, ఆ పార్టీ ప్రభుత్వ వ్యవహారశైలిని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో తమకు భద్రత లేకుండా పోయిందని, శాంతి భద్రతల్లో తమ పాత్ర ఏమీ లేకుండా పోయిందని, ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు సరిసగం హక్కులు ఉండాల్సి ఉండగా తమకేమీ హక్కులు, అధికారాలు లేవన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పోలీసులు కూడా తమ మాట వినే పరిస్థితి లేదని ఆయన వివరించినట్టు తెలిసింది. పైగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వ పాలనా కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అలాగే అనైతికంగా, చట్ట విరుద్ధంగా తమ పార్టీ నాయకుల, ప్రభుత్వ ఉన్నతాధికారుల, ముఖ్యమైన వ్యక్తుల ఫోన్‌లు ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని చంద్రబాబు వివరించి ఇందుకు సంబంధించి ఓ నివేదికను సమర్పించినట్టు తెలిసింది. విభజన చట్టంలోని సెక్షన్ 8 సమగ్ర అమలుకు డిమాండు చేస్తూ గవర్నర్‌కు శాంతి భద్రతల అధికారం అప్పగించాలని కోరినట్టు తెలిసంది. గవర్నర్‌కు అధికారాలను అప్పగించడం వల్లే తాము ఉమ్మడి రాజధాని నగరంలో ఉండగలుగుతామని చంద్రబాబు వివరించినట్టు చెబుతున్నారు. మొత్తంమీద ఢిల్లీ పర్యటనలో ప్రధానికి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంలో చంద్రబాబు సఫలమయ్యారని భావిస్తున్నారు.
ఉమాభారతితో బాబు సమావేశం రద్దు
కేంద్రమంత్రి ఉమాభారతితో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం రద్దు అయ్యింది. ఉమాభారతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో చంద్రబాబుతో ఉమాభారతి ఫోన్‌లో సంభాషించారు. పోలవరం ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా చంద్రబాబు వినతి చేశారు.
Advertisement