స్మగ్లర్ బదానీ గోదాముల్లో మరో రూ. 14 కోట్ల ఎర్రచందనం
హర్యానాలోని హిస్సార్ జిల్లాలో తలదాచుకున్న ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కడప జిల్లాకు తీసుకువచ్చారు. ఆయనను బద్వేల్ కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ సమయంలో అక్రమంగా అనధికార గొడౌన్‌లో దాచి ఉంచిన దాదాపు రూ. 20 కోట్లు విలువ జేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ముఖేష్ బదానీకి అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బదాని చైనా, మలేషియా దేశాలలోని ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నట్టు పసిగట్టారు. శేషాచలం అడవుల నుంచి […]
Advertisement
హర్యానాలోని హిస్సార్ జిల్లాలో తలదాచుకున్న ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కడప జిల్లాకు తీసుకువచ్చారు. ఆయనను బద్వేల్ కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ సమయంలో అక్రమంగా అనధికార గొడౌన్‌లో దాచి ఉంచిన దాదాపు రూ. 20 కోట్లు విలువ జేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ముఖేష్ బదానీకి అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బదాని చైనా, మలేషియా దేశాలలోని ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నట్టు పసిగట్టారు. శేషాచలం అడవుల నుంచి అక్రమంగా ఎర్ర చందనాన్ని తరలించి విదేశీయులకు అమ్మడం బదానీ ముఖ్య వ్యాపకం… వ్యాపారం. కొంతకాలంగా ముఖేష్ బదానీపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు పక్కా సమాచారంతో హిస్సార్ పోలీసుల సహకారంతో దాడులు చేసి ముఖేష్ బదానీని ఈ నెల 16న అరెస్ట్ చేశారు. ముఖేష్‌ను ఇపుడు కడపకు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. ఈ సమయంలో అతడిచ్చిన సమాచారం ఆధారంగా పోలీసు బృందం ఒకటి ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీలో కూడా కొంతమంది స్మగ్లర్లు ఉన్నట్టు విచారణ సమయంలో బదాని తెలిపాడు. ఇతనిచ్చిన సమాచారం ఆధారంగా విజయ నరసింహరెడ్డి అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే కొంత కీలక సమాచారం లభించింది. దీని ఆధారంగా ముఖేష్ బదానీకి చెందిన మూడు గోడౌన్లపై దాడి చేయగా మరో 14 కోట్ల రూపాయల విలువ జేసే ఎర్ర చందనం లభించింది. ఈ విషయాన్ని బద్వేల్ డీఎస్పీ రామకృష్ణ, సీఐ వెంకటప్ప తెలిపారు.
Advertisement