కేసీఆర్ కు పార్శీగుట్ట వాసి ఝలక్

హైదరాబాద్‌లోని పార్సీగుట్ట ప్రాంతం! అక్కడి అశోక్‌ నగర్లో ప్రాథమిక పాఠశాల! ‘స్వచ్ఛ హైదరాబాద్‌’లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్కడికి వచ్చారు. స్థానిక బస్తీ పెద్దలతో ముచ్చ‌ట్లు పెట్టారు. అదేదో సమావేశంలా కాకుండా రచ్చబండ తరహాలో వారితో మాట్లాడారు. బస్తీ సమస్యలు చెప్పాలని కోరారు. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అంతలో, పార్సీగుట్టకు చెందిన స్వామి అనే వ్యక్తిని కేసీఆర్‌ స్వయంగా పిలిచి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగింది వాస్తవం. కానీ, రాష్ట్రం ఇచ్చింది […]

Advertisement
Update:2015-05-18 04:36 IST
హైదరాబాద్‌లోని పార్సీగుట్ట ప్రాంతం! అక్కడి అశోక్‌ నగర్లో ప్రాథమిక పాఠశాల! ‘స్వచ్ఛ హైదరాబాద్‌’లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్కడికి వచ్చారు. స్థానిక బస్తీ పెద్దలతో ముచ్చ‌ట్లు పెట్టారు. అదేదో సమావేశంలా కాకుండా రచ్చబండ తరహాలో వారితో మాట్లాడారు. బస్తీ సమస్యలు చెప్పాలని కోరారు. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అంతలో, పార్సీగుట్టకు చెందిన స్వామి అనే వ్యక్తిని కేసీఆర్‌ స్వయంగా పిలిచి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగింది వాస్తవం. కానీ, రాష్ట్రం ఇచ్చింది మాత్రం కాంగ్రెస్సే. నువ్వు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్‌ వల్లనే. సోనియా గాంధీ పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. కేసీఆర్‌కు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. దాంతో మౌనంగా ఉండిపోయారు. ఇందిరా గాంధీ హయాంలోనే తాను కాంగ్రెస్‌లో చేరానని, అప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉంటున్నానని స్వామి చెప్పారు. ‘‘బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే ముందుగా బస్తీల్లో సమస్యలు పరిష్కరించాలె. నా చిన్నప్పుడు ఈ ప్రాంతంలో చెరువు ఉండేది. అక్కడ హోలీ పండుగకు కాముడు కాల్చేటోళ్లం. ఇప్పుడన్నీ ఇళ్లు వచ్చినయి.’’ అని చెప్పారు. మ‌ళ్ళీ ఆ చెరువు వ‌స్త‌దా… అంటూ ప్ర‌శ్నించారు. కేసీఆర్ అక్క‌డ నుంచి నాలుగ‌డుగులు ప‌క్క‌కేసి మ‌రొక‌రితో ముచ్చ‌ట్లు పెట్టారు.
Tags:    
Advertisement

Similar News