కమల్ హాసన్ డైరెక్ట్ గా చేస్తున్నాడు.
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రత్యేకంగా ఒక భాషకు సంబంధించిన నటుడు అని చెప్పలేం. అలా చెప్పినా ప్రేక్షకులు అంగీకరించరు. ఆయన అందరివాడు. అంతగా తన నటనతో ప్రభావితం చేయగలిగాడు. ఆయన మాతృభాషలో ఎంత పాపులార్టీ ఉందో తెలుగులో కూడా అంతకుమించి పాపులారిటీ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఆయన నటించనున్న తాజా చిత్రం ఈ నెల 24న ఆరంభం కానుంది. తమిళ వెర్షన్‌కు ‘తూంగా వనమ్’ అని టైటిల్ పెట్టారు. అంటే ‘నిద్రపోని అడవి’ అని […]
Advertisement
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రత్యేకంగా ఒక భాషకు సంబంధించిన నటుడు అని చెప్పలేం. అలా చెప్పినా ప్రేక్షకులు అంగీకరించరు. ఆయన అందరివాడు. అంతగా తన నటనతో ప్రభావితం చేయగలిగాడు. ఆయన మాతృభాషలో ఎంత పాపులార్టీ ఉందో తెలుగులో కూడా అంతకుమించి పాపులారిటీ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఆయన నటించనున్న తాజా చిత్రం ఈ నెల 24న ఆరంభం కానుంది. తమిళ వెర్షన్‌కు ‘తూంగా వనమ్’ అని టైటిల్ పెట్టారు. అంటే ‘నిద్రపోని అడవి’ అని అర్థం. మరి.. తమిళ టైటిల్‌ను యథాతథంగా అనువదించి, తెలుగులో ‘నిద్రపోని అడవి’ అని పెడతారా? లేక వేరే ఏదైనా టైటిల్ పెడతారా? అనేది వేచి చూడాలి.
ఇక ఈ మధ్య కమల్ హాసన్ కథ, స్క్రీన్ ప్లే చేసి నటించిన ఉత్తమ విలన్ చిత్రం ఆశించిన స్థాయిలో ఘన విజయం సాధించలేదు. వాణిజ్య అంశాల్ని పట్టించుకోక పోవడం.. అలాగే విడుదల విషయంలో జాప్యం జరగడవ వెరసి బిజినెస్ పరంగా దెబ్బతింది. కట్ చేస్తే దృశ్యం సినిమా పాపనాశనమ్ పేరుతో విడుదలకు సిద్దం అవుతుంది. అలాగే విశ్వరూపం-2 కూడా త్వరలో రిలీజ్‌కు సిద్దం చేస్తున్నారని వినికిడి.
Advertisement