రాహుల్ పర్యటనలో మార్పులు... హైదరాబాద్ కార్యక్రమాలు రద్దు
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో రైతు భరోసా యాత్రకు సబంధించి పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్ర చేసేందుకు వస్తున్న ఆయన గురువారం హైదరాబాద్ రావాల్సి ఉండగా మారిన షెడ్యూలు ప్రకారం కర్ణాటకలోని నాందేడ్ వెళుతున్నారు. అక్కడ నుంచి రాత్రికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని మయూర ఇన్ హోటల్‌లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఆయన ఆదిలాబాద్ జిల్లా పర్యటన ప్రారంభమవుతుంది. కొరిటికల్, లక్ష్మణ్‌చాందా, పొట్టుపల్లి, రాచాపూర్ […]
Advertisement
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో రైతు భరోసా యాత్రకు సబంధించి పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్ర చేసేందుకు వస్తున్న ఆయన గురువారం హైదరాబాద్ రావాల్సి ఉండగా మారిన షెడ్యూలు ప్రకారం కర్ణాటకలోని నాందేడ్ వెళుతున్నారు. అక్కడ నుంచి రాత్రికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని మయూర ఇన్ హోటల్‌లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఆయన ఆదిలాబాద్ జిల్లా పర్యటన ప్రారంభమవుతుంది. కొరిటికల్, లక్ష్మణ్‌చాందా, పొట్టుపల్లి, రాచాపూర్ మీదుగా వాడియల్ వరకు పాదయాత్ర జరుపుతారు. అక్కడే సాయంత్రం 4 గంటలకు రాహుల్ రైతులతో సమావేశమవుతారు. మారిన షెడ్యూలు ప్రకారం హైదరాబాద్‌లో ఆయన పర్యటన లేనట్టే. నిర్మల్ పర్యటనలో పాల్గొనే ఆయన అక్కడ బాధిత రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తారని భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు రాహుల్ నిర్మల్ నుంచి హైదరాబాద్ వస్తారు. అదే రోజు సాయంత్రం 9 గంటలకు ఢిల్లీ వెళ్ళిపోతారని భట్టి విక్రమార్క తెలిపారు. కాగా రైతుల్లో భరోసా కల్పించడానికే రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. రాహుల్ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, బడుగు బలహీనవర్గాలకు ఆసరాగా నిలబడాలన్నది ఆయన లక్ష్యమని ఆయన అన్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరిని కూడా ఆయన పలకరించిన పాపాన పోలేదని, ఢిల్లీలో ఉన్న రాహుల్‌గాంధీ విషయం తెలుసుకుని చలించిపోయారని, వారి కుటుంబాల పరామర్శించి ఆర్థిక సాయం చేయడానికి వస్తున్నారని శ్రీనివాస్ తెలిపారు.
Advertisement