రాజధాని భూ సేకరణకు జీవో జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ సేకరణకు సంబంధించి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూ సమీకరణకు ఇష్టపడని వారి నుంచి భూముల సేకరించడానికే ఈ జీవో 166 జారీ చేసినట్టు చెబుతున్నారు. ఈ ఆదేశాల కింద దాదాపు 800 ఎకరాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాజధానికి ఎవరు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారో వారి నుంచి భూములు లాక్కోవడమే ఈ జీవో ఉద్దేశ్యంగా భావిస్తున్నారు. కేంద్రం తాజా ఆర్డినెన్స్ ప్రకారం భూ సేకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ సేకరణకు సంబంధించి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూ సమీకరణకు ఇష్టపడని వారి నుంచి భూముల సేకరించడానికే ఈ జీవో 166 జారీ చేసినట్టు చెబుతున్నారు. ఈ ఆదేశాల కింద దాదాపు 800 ఎకరాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాజధానికి ఎవరు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారో వారి నుంచి భూములు లాక్కోవడమే ఈ జీవో ఉద్దేశ్యంగా భావిస్తున్నారు. కేంద్రం తాజా ఆర్డినెన్స్ ప్రకారం భూ సేకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 3న కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్‌లోని 2, 3 చాఫ్టర్లను మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో శుక్రవారం నుంచి ఈ భూ సేకరణ చట్టం అమలులోకి వస్తుందని తెలుస్తోంది. దీని కింద అధికారులు రైతుల నుంచి భూములు తీసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది.