వైఫై సేవలకు ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు
దేశంలో అతిచౌకైన, వేగవంతమైన వైఫై సేవలను గ్రామీణ ప్రాంతాల్లో అందించాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటివరకూ.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఫైబర్ ఆప్టిక్ విధానం ద్వారా వైఫై సేవలను అందిస్తున్నారు. దీంతో ఎక్కడైనా ఓ చోట వైరుతెగితే.. ఇంటర్నెట్ సేవలు ఆగిపోతున్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి అవరోధాలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా మల్టీ లైన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ భావిస్తోంది. హైదరాబాద్‌కు […]
Advertisement
దేశంలో అతిచౌకైన, వేగవంతమైన వైఫై సేవలను గ్రామీణ ప్రాంతాల్లో అందించాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటివరకూ.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఫైబర్ ఆప్టిక్ విధానం ద్వారా వైఫై సేవలను అందిస్తున్నారు. దీంతో ఎక్కడైనా ఓ చోట వైరుతెగితే.. ఇంటర్నెట్ సేవలు ఆగిపోతున్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి అవరోధాలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా మల్టీ లైన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ భావిస్తోంది.
హైదరాబాద్‌కు వైఫై కళ
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం త్వరలో హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్ళలో ఇంటర్నెట్ వైఫై సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఒకేసారి 1850 మంది నుంచి 2500 మంది వరకు ఈ వైఫై సేవలను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ఐ.టి.శాఖ భారీగా కసరత్తు చేస్తోంది. తొలి 30 నిమషాల వరకు ఎవరైనా ఈ వైఫై సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత వాడుకునే వారు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.-పీఆర్
Advertisement