అత్యవసర సేవలకు 112
ఏదైనా ప్రమాదం జరిగినపుడు వెంటనే ఎవరికి ఫోన్ చేయాలో తట్టదు. ప్రాణభయంతో ఉన్నవారిలో టెన్షన్ ఆ స్థాయిలో ఉంటుంది. అయితే మనకు యూనివర్సల్‌గా ఉపయోగించే ఫోన్ నంబర్లు ఉన్నాయి. పోలీసులకు ఫోన్ చేయడానికి 100 డయల్ చేస్తే చాలు. వారే ఆ ఏరియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 101 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు గంటల కారు వస్తుంది. రోడ్ల మీద యాక్సిడెంట్స్ జరిగితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన […]
Advertisement
ఏదైనా ప్రమాదం జరిగినపుడు వెంటనే ఎవరికి ఫోన్ చేయాలో తట్టదు. ప్రాణభయంతో ఉన్నవారిలో టెన్షన్ ఆ స్థాయిలో ఉంటుంది. అయితే మనకు యూనివర్సల్‌గా ఉపయోగించే ఫోన్ నంబర్లు ఉన్నాయి. పోలీసులకు ఫోన్ చేయడానికి 100 డయల్ చేస్తే చాలు. వారే ఆ ఏరియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 101 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు గంటల కారు వస్తుంది. రోడ్ల మీద యాక్సిడెంట్స్ జరిగితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన 108 నంబర్‌కు ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చేస్తుంది. ఈ మూడు నంబర్లు వినడానికి, గుర్తుంచుకోవడానికి చాలా తేలికే. కాని ఇది మామూలు పరిస్థితుల్లో అయితే ఓకే. కాని ప్రమాదంలో ఉన్నవారి మనోస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. ఏ నంబర్‌కు ఫోన్ చేయాలో తోచదు. పక్కన ఎవరైనా ఉంటే ఫర్లేదు. అసహాయ స్థితిలో ఉన్నవారికి ఈ నంబర్లన్నీ గుర్తుచేసుకుని ఫోన్ చేయడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సరికొత్త సలహా ఇచ్చింది. అమెరికాలో ఏ ప్రమాదమైనా దేశమంతా ఒకే ఫోన్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే సంబంధిత శాఖ వెంటనే స్పందిస్తుంది. బాధితులకు సహాయం లభిస్తుంది. అలాగే భారతదేశంలో కూడా పోలీస్, ఫైర్, అంబులెన్స్ సర్వీసులకు కలిపి ఒకే యూనివర్సల్ ఫోన్ నంబర్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. 112 నంబర్‌కు డయిల్ చేస్తే ఏ శాఖ పరిధిలో ఉంటే ఆ శాఖ తక్షణమే స్పందించి ప్రమాదంలో ఉన్నవారికి సాయపడేందుకు వీలుగా ఉంటుందని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. 112 నంబర్‌కు గనుక కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఇక దేశంలో ఎక్కడి నుంచైనా ప్రమాదంలో ఉన్నవారు ఆ నంబర్‌కు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చు.
Advertisement