ఈ-పాంట్రీతో రైల్వేల అనుసంధానం!

రైలులో మీరు కూర్చున్న చోటి నుంచే ఆర్డ‌ర్ ఇస్తే కోరుకున్న ఆహార పదార్థాలు చకాచకా మీ వ‌ద్ద‌కు వచ్చేస్తాయి! అదీ ఎంతో శుచీ, శుభ్రత గల ఆహారం. ఇందుకోసం రైల్వేలను ఈ-పాంట్రీతో అనుసంధానం చేసే యోచనలో ఉంది రైల్వే శాఖ‌. ఈ విష‌యాన్ని రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు చెబుతున్నారు. ఈ- పాంట్రీ ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ఆర్డర్‌ చేసే ఆహార పదార్థాలను నేరుగా ప్రయాణికుల సీట్ల వద్దకే కేటరర్లు చేరుస్తారు. ప్రధాన రైల్వేస్టేషన్లలో వారు నిర్వహించే […]

Advertisement
Update:2015-04-07 06:17 IST
రైలులో మీరు కూర్చున్న చోటి నుంచే ఆర్డ‌ర్ ఇస్తే కోరుకున్న ఆహార పదార్థాలు చకాచకా మీ వ‌ద్ద‌కు వచ్చేస్తాయి! అదీ ఎంతో శుచీ, శుభ్రత గల ఆహారం. ఇందుకోసం రైల్వేలను ఈ-పాంట్రీతో అనుసంధానం చేసే యోచనలో ఉంది రైల్వే శాఖ‌. ఈ విష‌యాన్ని రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు చెబుతున్నారు. ఈ- పాంట్రీ ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ఆర్డర్‌ చేసే ఆహార పదార్థాలను నేరుగా ప్రయాణికుల సీట్ల వద్దకే కేటరర్లు చేరుస్తారు. ప్రధాన రైల్వేస్టేషన్లలో వారు నిర్వహించే పాంట్రీ నుంచి ఇవి సరఫరా అవుతాయి. ఈ కొత్త వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలను భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) మాజీ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌ కకోద్కర్ త‌యారు చేస్తార‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని రాష్ట్రాల్లో ఈ-పాంట్రీ వ్యవస్థను నెలకొల్పే ఆలోచ‌న ఉంద‌ని మంత్రి తెలిపారు.-పీఆర్‌
Tags:    
Advertisement

Similar News