విషమించిన ఎస్సై సిద్ధయ్య ఆరోగ్యం
సూర్యాపేట సంఘటనకు సంబంధించి జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సబ్ ఇన్‌స్పెక్టర్ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు కామినేని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. శరీరంలో దిగిన బుల్లెట్లు బయటికి తీయలేని పరిస్థితి నెలకొనడంతో ఆయన్ని ఇన్‌టెన్సివ్ కేర్‌లోనే ఉంచారు. పది మంది వైద్యుల సమక్షంలో ఐసీయులో ఉంచే ఒక ఆపరేషన్ పూర్తి చేశారు. అయినప్పటికీ ఇంకా ఎస్సై తలలో ఒక బుల్లెట్ ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. ఆ సందర్భంలోనే ఆయన పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. […]
Advertisement
సూర్యాపేట సంఘటనకు సంబంధించి జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సబ్ ఇన్‌స్పెక్టర్ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు కామినేని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. శరీరంలో దిగిన బుల్లెట్లు బయటికి తీయలేని పరిస్థితి నెలకొనడంతో ఆయన్ని ఇన్‌టెన్సివ్ కేర్‌లోనే ఉంచారు. పది మంది వైద్యుల సమక్షంలో ఐసీయులో ఉంచే ఒక ఆపరేషన్ పూర్తి చేశారు. అయినప్పటికీ ఇంకా ఎస్సై తలలో ఒక బుల్లెట్ ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. ఆ సందర్భంలోనే ఆయన పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. మరో 48 గంటలు దాటితే తప్ప ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ప్రకటన చేయలేమని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేసి 48 గంటలు అయిపోయింది. అయినా సిద్ధయ్య ఆరోగ్యం వైద్యానికి సానుకూలంగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో కామినేని ఆస్పత్రి వైద్యులు తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి అంత సానుకూలంగా లేదని, వైద్యానికి ఆయన శరీరం స్పందించడం లేదని తెలిపారు.-పీఆర్
Advertisement