ధూమ‌పాన హెచ్చ‌రిక‌లు పెద్ద‌గా ఉండాల్సిందే: ప్రధాని

సిగరెట్‌ పాకెట్లు, బీడీ కట్టలపై 65 శాతం పరిమాణంలో చిత్ర స‌హిత‌ హెచ్చరిక’లను ముద్రించేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఆరోగ్యశాఖను ఆదేశించారు. వాస్తవానికి పొగాకు ఉత్పత్తుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలను ప్రతిబింబించే బొమ్మలను ఆయా పాకెట్ల సైజులో 85 శాతం పరిమాణంలో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1 నుంచే ఇది అమలు కావాల్సి ఉండగా పార్లమెంటరీ కమిటీ అభ్యంతరాలతో ఆపివేశారు. అయితే, పొగాకు లాబీకి ప్రభుత్వం తలొగ్గడమే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. […]

Advertisement
Update:2015-04-06 05:00 IST
సిగరెట్‌ పాకెట్లు, బీడీ కట్టలపై 65 శాతం పరిమాణంలో చిత్ర స‌హిత‌ హెచ్చరిక’లను ముద్రించేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఆరోగ్యశాఖను ఆదేశించారు. వాస్తవానికి పొగాకు ఉత్పత్తుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలను ప్రతిబింబించే బొమ్మలను ఆయా పాకెట్ల సైజులో 85 శాతం పరిమాణంలో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1 నుంచే ఇది అమలు కావాల్సి ఉండగా పార్లమెంటరీ కమిటీ అభ్యంతరాలతో ఆపివేశారు. అయితే, పొగాకు లాబీకి ప్రభుత్వం తలొగ్గడమే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో పాల్గొన్న ప్రధాని ఆరోగ్యశాఖకు ఆదేశాలివ్వడం గమనార్హం. అలాగే పొగాకు ఉత్పత్తులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలో బీడీ పరిశ్రమ సామ్రాజ్యాధినేత, అలహాబాద్‌ ఎంపీ శ్యామాచరణ్‌ గుప్తా సభ్యుడుగా ఉండటంపైనా అసహనం వ్యక్తం చేశారని సమాచారం. పార్లమెంటరీ కమిటీల్లో స‌ద‌రు వ్యాపారాలు చేసేవారిని వేయ‌కూడ‌ద‌న్న‌ది ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ఆయ‌న ఆక్షేపించారు.-పీఆర్‌
Tags:    
Advertisement

Similar News