రైతు ఆత్మహత్యలకు కేసీఆరే బాధ్యుడు: అగ్నివేశ్
ఖమ్మం: కేసీఆర్ పాలన ప్రజావ్యతిరేకంగా సాగుతోందని స్వామి అగ్నివేశ్ విమర్శించారు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన పీవైఎల్ రాష్ట్ర మహాసభలకు స్వామి అగ్నివేశ్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య హాజరయ్యారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని అగ్నివేశ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమావేశంలో మాట్లాడిన పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య కూడా కేసీఆర్ పాలనను దుయ్యబట్టారు.తెలంగాణ వస్తే కోటి ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయని సంధ్య […]
Advertisement
ఖమ్మం: కేసీఆర్ పాలన ప్రజావ్యతిరేకంగా సాగుతోందని స్వామి అగ్నివేశ్ విమర్శించారు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన పీవైఎల్ రాష్ట్ర
మహాసభలకు స్వామి అగ్నివేశ్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య హాజరయ్యారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ
లేదని అగ్నివేశ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే
సమావేశంలో మాట్లాడిన పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య కూడా కేసీఆర్ పాలనను దుయ్యబట్టారు.తెలంగాణ వస్తే కోటి ఉద్యోగాలు
ఇస్తామన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయని సంధ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలో ఆదివాసీలు భూమి కోసం పోరాడుతున్నారని,
వారి ఆవేదనను పట్టించుకునే నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది తిండి, ఇల్లు అన్న విషయాన్ని
సీఎం గుర్తుంచు కోవాలన్నారు. కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.-పిఆర్
Advertisement