కేసీఆర్‌వి ఉడత ఊపులు: భట్టి విమర్శ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌వి ఉడత ఊపులని, వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీని బెదిరించాలని, భయపెట్టాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన విజయం సాధించలేరని భట్టి ఉద్ఘాటించారు. మర ఫిరంగులకు కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఏమీ చేయలేవని.. అలాంటిది కేసీఆర్ ఉడత ఊపులకు భయపడతారనుకుంటే అంతకన్నా అజ్ఞానం ఏమీ ఉండదని భట్టి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని, […]
Advertisement
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌వి ఉడత ఊపులని, వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీని బెదిరించాలని, భయపెట్టాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన విజయం సాధించలేరని భట్టి ఉద్ఘాటించారు. మర ఫిరంగులకు కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఏమీ చేయలేవని..
అలాంటిది కేసీఆర్ ఉడత ఊపులకు భయపడతారనుకుంటే అంతకన్నా అజ్ఞానం ఏమీ ఉండదని భట్టి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని, దాన్ని అంతం చేస్తామని ఆయన చెప్పారు. కేసీఆర్ హామీల మీద హామీలు ఇస్తున్నారుగానీ, ఒక్క హామీ అమలుకైనా నిధులు కేటాయించిన దాఖలాలు లేవని భట్టి విక్రమార్క విమర్శించారు. 2019 సంవత్సరం ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా కేసీఆర్‌కు ఈసారి అధికారం దక్కి ఉండవచ్చని, రాష్ట్రం ఇచ్చిన పార్టీని తెలంగాణ ప్రజలు మరిచిపోరని ఆయన అన్నారు.-పిఆర్
Advertisement