Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ కేరళ టూర్! ప్యాకేజీ వివరాలివే..

కేరళలోని అందాలు, కల్చరల్ ప్లేసులను కవర్ చేస్తూ ఐఆర్ సీటీసీ.. కల్చరల్ కేరళ పేరుతో ఓ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది.

ఐఆర్‌‌సీటీసీ కేరళ టూర్! ప్యాకేజీ వివరాలివే..
X

మాన్‌సూన్ సీజన్‌లో కేరళ టూర్ వేయాలనుకునేవారికోసం ఐఆర్‌‌సీటీసీ ఓ ప్రత్యేకమైన టూర్ ఆపరేట్ చేస్తోంది. ధరలు, ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..

కేరళలోని అందాలు, కల్చరల్ ప్లేసులను కవర్ చేస్తూ ఐఆర్ సీటీసీ.. కల్చరల్ కేరళ పేరుతో ఓ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు సాగే ఈ టూర్.. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. టూర్‌‌లో భాగంగా కొచ్చి, కుమారకోమ్, మున్నార్, త్రివేండ్రం ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ఆగస్ట్ 13న ప్రారంభమవుతుంది.

ఐఆర్‌సీటీసీ కల్చరల్ కేరళ టూర్.. మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే 9.15 గంటలకు కొచ్చి చేరుకుంటారు. మొదటిరోజంతా కొచ్చి విజిట్ ఉంటుంది. ఫోర్ట్ కొచ్చి, బీచ్‌తోపాటు మెరీన్ డ్రైవ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి కొచ్చిలో స్టే ఉంటుంది. రెండో రోజు బస్సులో మున్నార్ బయల్దేరతారు. చీయపరా వాటర్ ఫాల్స్, టీ మ్యూజియం వంటివి కవర్ చేసుకుని ఆ రోజు రాత్రికి మున్నార్‌లో స్టే చేస్తారు.

ఇక మూడోరోజు మున్నార్ లోని మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండ్ల డ్యామ్ లేక్ వంటివి చూసుకుని రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు. నాలుగో రోజు మున్నార్ నుంచి కుమారకోమ్ బయల్దేరతారు. కుమారకోమ్‌లో బ్యాక్‌వాటర్స్ ఎక్స్‌ప్లోర్ చేసి.. ఐదో రోజు త్రివేండ్రం బయల్దేరతారు. అక్కడ జటాయు పాయింట్, లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. ఆరో రోజు పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత నేపియర్ మ్యూజియం, శివ స్టాచ్యూ వంటివి చూసుకుని రాత్రి 10.20 గంటలకు త్రివేండ్రంలో రిటర్న్ ఫ్లైట్ ఎక్కి 11.55 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.32,700, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.33,800, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.47,700గా ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్ టికెట్స్, హోటల్‌ స్టే, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌‌సీటీసీ వెబ్‌సైట్ (irctctourism.com) విజిట్ చేయొచ్చు.

First Published:  26 Jun 2024 11:30 AM GMT
Next Story