Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, June 19
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»More

    Moto Razr 50 Ultra | భార‌త్‌లో మోట‌రోలా ప్రీమియం ఫోన్ మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా ఆవిష్క‌ర‌ణకు ముహూర్తం ఖ‌రారు.. ఎప్పుడంటే..?!

    By Telugu GlobalJune 26, 20242 Mins Read
    Moto Razr 50 Ultra | భార‌త్‌లో మోట‌రోలా ప్రీమియం ఫోన్ మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా ఆవిష్క‌ర‌ణకు ముహూర్తం ఖ‌రారు.. ఎప్పుడంటే..?!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    Moto Razr 50 Ultra | చైనా ఎల‌క్ట్రానిక్స్ మేజ‌ర్ లెనోవో (Lenovo) అనుబంధ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా (Motorola) త‌న ప్రీమియం ఫోన్లు మోటో రేజ‌ర్ 50 (Moto Razr 50), మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్ల‌ను చైనాతోపాటు నార్త్ అమెరికా, యూర‌ప్‌, బ్రిట‌న్‌తోపాటు సెలెక్టెడ్ గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించింది. చైనా మార్కెట్‌లో ఆవిష్క‌రించిన మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌డానికి ముహూర్తం ఖ‌రారు చేసింది. ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా ఫ్లిప్‌స్టైల్ ఫోల్డ‌బుల్ ఫోన్ మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) విక్ర‌యించ‌నున్న‌ది.

    మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8ఎస్ జెన్ 3 (Qualcomm Snapdragon 8s Gen 3) ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. త్వ‌ర‌లో మార్కెట్‌లోకి రానున్న శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6) ఫోన్‌తో పోటీ ప‌డుతుంది. లెనోవో (Lenovo) అనుబంధ మోట‌రోలా త‌న మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్‌ను జూలై నాలుగో తేదీన భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

    మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్ మిడ్‌నైట్ బ్లూ (Midnight Blue), స్ప్రింగ్ గ్రీన్ (Spring Green), పీచ్ ఫ‌జ్ (Peach Fuzz) క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా ఫోన్‌లో మోటో ఏఐ (Moto AI), గూగుల్ జెమినీ (Google Gemini) ఫీచ‌ర్లు ఉంటాయి. 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ మ‌ద్ద‌తు, గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ (Gorilla Glass Victus) ప్రొటెక్ష‌న్‌తోపాటు 4-అంగుళాల (1,080×1,272 పిక్సెల్స్‌) పోలెడ్ క‌వ‌ర్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8ఎస్ జెన్ 3 (Qualcomm Snapdragon 8s Gen 3) ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తు, 15వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది.

    మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్ 6.9- అంగుళాల ఇంట‌ర్న‌ల్ పోలెడ్ ఫ్లెక్సిబుల్ స్క్రీన్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యుయ‌ల్ ఔట‌ర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తోంది. ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) మ‌ద్ద‌తుతో 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్స‌ర్ కెమెరా, 50 – మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఇన్న‌ర్ డిస్‌ప్లేలో 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఐపీఎక్స్ 8 (IPX8) రేటెడ్ వాట‌ర్ రెసిస్టెన్స్ బిల్డ్ చేశారు.

    చైనాతోపాటు ఆవిష్క‌రించిన గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.66 వేలు (5699 చైనా యువాన్లు), టాప్ ఎండ్ మోడ‌ల్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ దాదాపు రూ.74 వేలు (6199 చైనా యువాన్లు) ప‌లుకుతుంది. భార‌త్ మార్కెట్‌లోనూ ఇవే ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉంటుంద‌ని భావిస్తున్నారు. మోడ్ర‌న్ గ్రీన్ (Modern Green), పీచ్ ఫ‌జ్ (Peach Fuzz), వింటేజ్ డెనిమ్ (Vintage Denim) రంగుల్లో ల‌భిస్తుంది. మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా ఫోన్ ఇప్ప‌టికే మార్కెట్‌లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 5 (Samsung Galaxy Z Flip 5) ఫోన్‌తోపాటు త్వ‌ర‌లో మార్కెట్‌లోకి రానున్న శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6) ఫోన్‌కూ గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న‌ది.

    Amazon Moto Razr 50 Ultra
    Previous Articleకెన్యాలో అప్రమత్తంగా ఉండండి – భారతీయులకు కేంద్రం కీలక సూచన
    Next Article ఐఆర్‌‌సీటీసీ కేరళ టూర్! ప్యాకేజీ వివరాలివే..
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.