కాంగ్రెస్ 14 నెలల పాలన అసంతృప్తికరంగా ఉంది : కిషన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు

తెలంగాణలో 14 నెలల కాంగ్రెస్ పాలన అసంతృప్తి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా?, రిటైర్‌మెంట్ బెన్ ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయం?, ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటు, నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు మీరు ఏ సందేశం ఇస్తున్నట్లు?, కళాశాలల యాజమాన్యాలపట్ల మీ తీరు దుర్మార్గం, ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు సమంజసం? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటు.
నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా ఒక్కొక్కరికి రూ.56 వేలు బకాయిపడి యువతను దగా చేశారు. ఏమాత్రం నిజాయతీ ఉన్నా యుద్ధ ప్రాతిపదికన ఆ బకాయిలు విడుదల చేయాలి. నేడే రూ.7,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయాలి. ఇవన్నీ విడుదల చేసిన తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. దగా హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు సిద్ధంగా లేరని కిషన్‌రెడ్డి హితవు పలికారు.