Telugu Global
Sports

ఉమెన్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ బ్యాటింగ్..లంకతో చావోరేవో

ఉమెన్ టీ20 వరల్డ్‌కప్‌లో టాస్‌ గెలిచిన భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ టీమ్ఇండియాకు చాలా కీలకం.

ఉమెన్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ బ్యాటింగ్..లంకతో చావోరేవో
X

ఉమెన్ టీ20 వరల్డ్‌కప్‌లో టాస్‌ గెలిచిన భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ టీమ్ఇండియాకు చాలా కీలకం. సెమీస్‌ చేరాలంటే శ్రీలంకపై భారీ తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలి. అంతేకాకుండా చివరి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోకుంటే సెమీస్‌ చేరడం కష్టమవుతుంది. అయితే పటిష్ట జట్లు ఉన్న గ్రూప్-ఏలో టాప్-2లో నిలిచి సెమీఫైనల్ చేరాలంటే మాత్రం ఈ ప్రదర్శన సరిపోదు. టాప్-2లో నిలవాలంటే మ్యాచ్ గెలవడంతో పాటు నెట్‌రన్ రేట్ కూడా భారీగా కావాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఆడే ప్రతీ మ్యాచు భారత్‌కు నాకౌట్ లాంటిదే. ఒక్క దాంట్లో ఓడినా నిష్క్రమించినట్లే.

భారత్ : షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజీవన్ సజన, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా సింగ్.

శ్రీలంక : విష్మి గుణరత్నె, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవీషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికెట్‌కీపర్), అమ కాంచన, సుగంధిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రణవీర.

First Published:  9 Oct 2024 1:55 PM GMT
Next Story