ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 49.4 ఓవర్ల వద్ద 241 రన్స్‌కు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62), మహ్మద్ రిజ్వాన్ (46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 104 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సల్మాన్ అఘా (19), ఖుష్దిల్ షా (38) రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, అక్షర్‌జ జడేజా, రాణా చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో నసీమ్ షా క్యాచ్ పట్టడంతో కోహ్లీ రికార్డు అందుకున్నాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు (157) పట్టిన క్రికెటర్‌గా నిలిచాడు. అజహరుద్దీన్ (156) ను కోహ్లీ అధిగమించాడు. ఓవరాల్‌గా జయవర్దెనె (218), రికీ పాంటింగ్ (160) ముందున్నారు.
Previous Articleభారత బౌలర్ల దాటికి బంగ్లా టాప్ ఆర్డర్ విలవిల
Next Article మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!
Keep Reading
Add A Comment