గొంగడి త్రిషకు సీఎం రేవంత్ అభినందనలు..రూ.కోటి నజరానా
అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరానా ప్రకటించారు.
BY Vamshi Kotas5 Feb 2025 3:31 PM IST
X
Vamshi Kotas Updated On: 5 Feb 2025 3:31 PM IST
మహిళా క్రికెటర్ గొంగడి త్రిష జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్‌లో దేశం తరుపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ క్రమలోనే ముఖ్యమంత్రి క్రికెటర్ త్రిషకు కోటి రూపాయల నజరానా ప్రకటించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్ తెలంగాణకు చెందిన మరో క్రికెటర్ ధృతి కేసరికి కూడా 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.
Next Story