Andhra Pradesh
రాష్ట్రంలో ప్రతిరోజు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వంలో ఉండి కళ్లున్నా చూడలేని కబోదుల్లా టీడీపీ నేతలు మారారని వైసీపీ అంటోంది.
ఈనెల 22 ఉదయం 10గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెడతారు.
ఏపీ లిక్కర్ పాలసీ కూడా మందుబాబుల్లో అసంతృప్తికి కారణం అయిందని వివరించారు మార్గాని భరత్. లిక్కర్ పాలసీ అలా ఉండటానికిి కారణం జగన్ కి మందు అలవాటు లేకపోవడమేనన్నారు.
సదరు న్యూస్ ఛానెల్ లో పనిచేసే సిబ్బందిలో ఎంత మందికి జీతాలిస్తున్నారని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. రిపోర్టర్లకు జీతాలు ఇవ్వకుండా వారిని కలెక్షన్ ఏజెంట్లుగా మార్చేశారని మండిపడ్డారు.
ఆరోపణలు సరే, ఆధారాలు చూపండి అంటున్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు నుంచి టీడీపీ ఇదే విషయంపై వైసీపీని నిలదీసే అవకాశాలున్నాయి.
ఆయన రెండు రోజులుగా ఎక్కడా కనిపించలేదు. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్షలు జరపలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఏపీలో జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వచ్చాయి.
జాతీయ, అంతర్జాతీయ సుపారీ గ్యాంగులు, మావోయిస్టుల నుంచి పవన్‌కు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు కేంద్రానికి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందట.
గురువారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు ఏపీ పరిస్థితిని ప్రస్తావిస్తారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారు.
హత్యల్లో ఏపీ, బీహార్‌ని తలపిస్తోందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌ని గాలికి వదిలేయడంతో ఇష్టారాజ్యంగా రౌడీలు రెచ్చిపోతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
. ఏ పరాయి మహిళతోనూ తనకు అనైతిక, అక్రమ సంబంధాలు లేవన్నారు. తను నమ్మిన దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర సన్నిధిలో కూడా ఈ మాట చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు విజయసాయి.